విజయ్ దేవరకొండకు రామ్ చరణ్ ను దాటే ఛాన్స్..?

15
vijay devarakonda
vijay devarakonda

vijay devarakonda

సాధారణంగా ప్రయాణం మొదలుపెట్టి అసాధారణమైన రీతిలో స్టార్డమ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో కంట్రీ మొత్తం ఆకట్టుకున్న ఈ స్టార్ గీత గోవిందంతో స్టార్ హీరోల లిస్ట్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు పోయాయి. అయినా అతని క్రేజ్ తగ్గలేదు. అప్పుడే చాలామంది అతను పెద్ద స్టార్ అవుతాడు అనుకున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తున్నాడు. కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాతగా ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్యాన్ ఇండియన్ అయింది. తర్వాత శివ నిర్వాణతోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు. అయితే అనూహ్యంగా సుకుమార్ డైరక్షన్ లో సినిమా అనౌన్స్ కావడం ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరిచింది. పైగా అనౌన్స్ మెంట్ లోనే ప్యాన్ ఇండియన్ సినిమా అన్నారు. ఓ రకంగా ఇది విజయ్ దేవరకొండకు తిరుగులేని ఛాన్స్ అనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటూ టాప్ సిక్స్ హీరోల లిస్ట్ ఉంది. వీరిలో ప్రభాస్ రేంజ్ ను ఎవరూ అందుకోలేరని అతని లేటెస్ట్ సినిమాల సెలెక్షన్ తో తేలిపోయింది. ఇక టాలీవుడ్ లోనే టాప్ లిస్ట్ ఉండాలి.

అందులో పవన్ కళ్యాణ్ మళ్లీ ఎప్పుడు పాలిటిక్స్ లోకి వెళతాడో చెప్పలేం. అయినా క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఇక మహేష్ బాబు రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. ఈ రేస్ లోకి అల వైకుంఠపురములో తర్వాత కాస్త ముందుకు వచ్చాడు బన్నీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. దీం తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అందువల్ల లిస్ట్ లో చివరగా నిలిచేది రామ్ చరణ్. ఇదే విజయ్ దేవరకొండకు ఓ సూపర్ ఛాన్స్ గా మారబతోంది. పూరీ జగన్నాథ్, సుకుమార్ లతో చేస్తోన్న సినిమాలు ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్. ఈ రెండూ పెద్ద విజయాలు సాధిస్తే ఆటోమేటిక్ గా ఈ టాప్ ఫైవ్ లోకి ఎంటర్ అవుతాడు విజయ్ దేవరకొండ. అంటే ముఖ్యంగా రామ్ చరణ్ ప్లేస్ ను రీప్లేస్ చేస్తాడన్నమాట. అదెలాగంటే.. ఇప్పటి వరకూ ఉన్న టాప్ సిక్స్ హీరోస్ లో సరైన ప్లానింగ్ లేకుండా ఉన్నది చరణే.

ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద హిట్ అయినా.. రాజమౌళి క్రేజ్ ముందు అందులో చరణ్ కు దక్కే క్రెడిట్ చాలా తక్కువగానే ఉంటుంది. అందులోనూ ఎన్టీఆర్ షేర్ కూడా ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఆచార్యలో కీలక పాత్ర చేస్తున్నాడు. కానీ తను హీరో కాదు. మరోవైపు ఇప్పుడు పెద్ద దర్శకులెవరూ ఖాళీగా లేరు. అంటే దానర్థం సక్సెస్ పరంగా చరణ్ రాబోయే రెండేళ్లూ చాలా వెనక బడి ఉంటాడు. విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటే ఖచ్చితంగా అతని ప్లేస్ లోకి వస్తాడు. అందుకే ఇది విజయ్ కి ఓ సూపర్ చాన్స్ అనే చెప్పాలి. అయితే అదంత సులువు కూడా కాదు. పూరీ జగన్నాథ్ సినిమా కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. లేదంటే డిజాస్టరే. సుకుమార్ మూవీ ఎలా ఉన్నా ఫ్లాప్ టాక్ మాత్రం తెచ్చుకోదు. సో.. ఇక్కడ కాస్త జాగ్రత్త పడితే విజయ్ దేవరకొండ.. చరణ్ ప్లేస్(ప్రస్తుతానికి) ను రీ ప్లేస్ చేసి టాప్ సిక్స్ లోకి ఎంటర్ కావడం అంత కష్టమేం కాదు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here