విజయ్ దేవరకొండతో అనుష్క..?

vijay deverakonda anuskha

క్రేజీ కాంబినేషన్స్ అని వింటూ ఉంటాం.. కానీ చాలాసార్లు అవి అంత క్రేజీగా ఏం ఉండవు. బట్ కొన్నిసార్లు రూమర్స్ కూడా ఉలిక్కిపడేలా చేస్తాయి. ఇది నిజమా అని తట్టి చూసుకునేలా ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. దాదాపు ఎవరి ఊహల్లోనూ లేని ఈ ప్రాజెక్ట్ నిజంగానే సెట్ అవుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. వింటే మీరు కూడా సర్ ప్రైజ్ అవుతారు. అనుష్క.. వైవిధ్యమైన సినిమాలతో టాప్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ. అటు గ్లామర్ విషయంలోనూ ఇటు నటనలోనూ తనకు తిరుగు లేదు అనిపించుకుంది. బాహుబలి తర్వాత జీరోసైజ్ సినిమా కోసం బరువు పెరిగి మొత్తానికే మోసం తెచ్చుకున్న ఈ భాగమతి రీసెంట్ గా నిశ్శబ్ధం సినిమాలో మరోసారి చాలెజింగ్ రోల్ ప్లే చేసింది. బట్ సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేదు. కాకపోతే స్వీటీ ఎఫర్ట్ కు మంచి పేరే వచ్చింది. అయితే రీసెంట్ గా తను ఓ రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్టు చెప్పింది. అనుష్క రెండు సినిమాలు ఒప్పుకున్న విషయం కూడా చాలామందికి తెలియదు. కరోనా కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ విషయం బయటకు రాలేదు. అయితే ఈ రెండు సినిమాల గురించి నిర్మాతలు త్వరలోనే ప్రకటిస్తారు అని కూడా తను చెప్పింది. మామూలుగా అనుష్క ఇప్పుడు ఉన్న ఫిజిక్ ను బట్టి చూస్తే తను మళ్లీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తుంది అని ఎవరైనా భావిస్తారు. అది నిజమే అయినా ఓ సినిమాలో మాత్రం ఈ దేవసేన సరసన ఎవరూ ఊహించిన ఓ క్రేజీ స్టార్ కూడా ఉండబోతున్నాడట.

అంతకు ముందు  చేసిన సినిమాల కంటే అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ తిరుగులేని స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. యస్.. అనుష్క సరసన నటించే ఆ క్రేజీ హీరో ఈ రౌడీ స్టారే అనేది లేటెస్ట్ గా వినిపిస్తోన్న న్యూస్. అయితే సినిమాలో హీరో, హీరోయిన్ అనేందుకు ఇద్దరి మధ్య వయసు భేదం చాలా ఉంది. కాదంటే భాగమతిలో హీరోలాగా ఉండాల్సి ఉంటుంది. అందుకు రౌడీ స్టార్ ఒప్పుకున్నాడు అని వినిపిస్తోన్నా.. ఇంకా కన్ఫార్మ్ కాలేదు. అనుష్క – విజయ్ దేవరకొండ.. ఈ కాంబినేషనే ఓ హాట్ టాపిక్ అయిపోయింది. అయితే మహానటిలో చేసినట్టుగా విజయ్ కి కాస్త ఛాలెజింగ్ గా ఉండి..చిన్నదైనా ఎఫెక్టివ్ గా కనిపించే పాత్ర అనిపిస్తే చేస్తాడు అనుకోవచ్చు. పైగా అనుష్క సరసన మళ్లీ మళ్లీ నటించే చాన్స్ కూడా రాకపోవచ్చు. అందుకే అతనూ
ఒప్పుకుంటాడు అనుకుంటున్నారు. ఏదేమైనా విజయ్ విత్ అనుష్క అనే మాట రౌడీ ఫ్యాన్స్ లో కూడా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *