దర్జాగా క్రికెట్ చూసి ఎంజాయ్ చేసిన ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా

Spread the love

VIJAY MALAYA Enjoyed Watching Cricket

బ్యాంకుల్ని వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ఆరాంగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు . ఇంగ్లాండ్‌ లో ఫుల్‌ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓవల్‌లో జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వచ్చి మీడియా కంటికి చిక్కాడు. భారత్‌లో కేసులు, ఇక్కడికి రావడంపై అడిగితే, ‘నేను మ్యాచ్ చూడటానికి వచ్చానంటూ ముక్తసరిగా సమాధానం చెప్పాడు.
హైఫై లైఫ్‌స్టై‌ల్‌తో ప్రపంచ మీడియాను ఆకర్షించిన మాల్యా… భారత్‌లోని బ్యాంకులకు ఏకంగా 9 వేల కోట్లు ఎగనామం పెట్టి, ఇంగ్లాండ్‌ చెక్కేశాడు. బ్యాంక్‌లు అతన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి. విజయ్ మాల్యాను రప్పించేందుకు భారతదేశం ప్రయత్నిస్తూనే ఉంది. మనదేశంలో ఆయన కోసం జైలు కూడా సిద్ధం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.

అయితే మాల్యాపై అప్పగింత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఆయన్ను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి. అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు. లండన్ హై కోర్టులో జూలై 2న విచారణ ఉంది. భారతీయ జైళ్లు సురక్షితం కావన్న వాదనతో కోర్టులో పోరాడుతున్నాడు.మల్యాగతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన భారత మ్యాచులకు కూడా క్రమం తప్పకుండా హాజరయ్యాడు. స్టేడియంలోని వీఐపీ సెక్షన్‌లో కూర్చుని దర్జాగా మ్యాచ్‌లను వీక్షించాడు. ఇప్పుడు కూడా ఆసిస్-ఇండియా మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. ఇండియాను దోచుకున్న ఆర్ధిక నేరగాడు , కరెక్టుగా గా చెప్పాలంటే ఈ దొంగ పని బాగుంది. దర్జాగా క్రికెట్ చూసి ఎంజాయ్ చేశాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *