చంద్రబాబుని ఫెవికాల్ బాబా అంటున్నారన్న విజయసాయి

Spread the love

Vijay Sai Commented Chandrababu is a Fevicol

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాకహ్యలు చేశారు. ఏ మాతరం అవకాశం దొరికినా చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయి రెడ్డి చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీలో అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా-వీళ్లను కలుపుతా అని చంద్రబాబు అంటున్నారని దుయ్యబట్టారు. ఇది చూసిన నేతలు చంద్రబాబుకు ఈ మారుపేరు పెట్టారనీ, జోకులు వేసుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలు ఏమిటని జోకులేసుకుంటున్నారట’’ అని ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *