ప్రకృతితో పెట్టుకుంటే మటాషే చంద్రబాబు

vijay sai comments on chandra baabu

ఏపీలో వరదలతో జలాశయాలు నుండి, అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో  ఇక ఈ అవకాశాన్ని కూడా వైసీపీ  చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలా చక్కగా వాడుకుంటుంది. ఇప్పటికే ఏపీ మంత్రులు చంద్రబాబు ఇంటికి  వరద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ కు  పారిపోయారు  అంటూ వ్యాఖ్యలు చేయగా,  ఇక వరుస ట్వీట్లతో  చంద్రబాబుని టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ  విజయ సాయి రెడ్డి .   కృష్ణా నది వరదలనూ , కరకట్ట మీద లింగమనేని గెస్ట్ హౌస్ నూ వదలని   విజయసాయి రెడ్డి తన ట్వీట్లలో  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అపచారాలకు  ఆగ్రహించి కృష్ణమ్మ  జల కొరడా ఝుళిపించిందని , ఇసుక దోపిడీ చేసి ,నదిని పూడ్చి  దీవులను ఏర్పాటుచేసి, గెస్ట్ హౌస్ లు కట్టి  నీటి నిల్వను ఆక్రమణలతో  తగ్గించేశారని  ఆరోపించారు విజయ సాయి.    అంతేకాదు  ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తే తను మాత్రం హైదరాబాద్లో దాక్కున్నాడంటూ  చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు.  ఇక మరో ట్వీట్లో చంద్రబాబు గారి కష్టాలు పగవాడికి కూడా రావొద్దు  అంటూ ట్వీట్ చేశారు  విజయసాయి.  కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో హైదరాబాద్ పారిపోయారన్న ఆయన ఇంటి ఆవరణలోని కార్లు విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించారు. ఇప్పుడైనా అర్థమైందా బాబు గారూ నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో? అంటూ  చంద్రబాబును ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.  ఇక ఇదే విషయంపై ట్వీట్ల పరంపర కొనసాగించిన విజయసాయి  చంద్రబాబుపై  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎన్నికల్లో ఓటమి పాలైన సమయములో   మీరు ఓడిపోవడం ఏంటయ్యా అని  అప్పుడు  మహిళాకార్యకర్తలతో  ఉత్తుత్తి శోకాలు పెట్టించారు.  ఇప్పుడు మీ ఇల్లు మునిగిపోవటం ఏంటయ్యా ?  వరదలో కొట్టుకు పోతే పోయింది.. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని  వందలాది మంది బాబుని బతిమిలాడుతున్నట్లు   వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది అంటూ  విజయసాయి ట్వీట్ చేశారు.  ఇక అంతే కాదు  నదులు వాగులు   తవ్వి  ఏ ఇసుక నుంచి ధనరాసులు పోగు చేసుకున్నాడో, ఇప్పుడు అవే  ఇసుక బస్తాలతో కరకట్ట  కొంప ను  వరదనుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలు అంటూ  విజయసాయి ట్వీట్ చేశారు.  అంతేకాదు ప్రకృతి తో పెట్టుకుంటే మటాషే బాబు అంటూ  హేళన  చేశారు.

ఐదేళ్లుగా బాబు గారు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని రాస్తుందేమో ఎల్లో మీడియా? రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా బాబు గారు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు  అన్న విజయ సాయి  “ఏడాది క్రితం కృష్ణకు ఇలాంటి వరద వచ్చి ఉంటే మోదీ మెప్పుకోసం మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు కావాలనే లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని విడిచి పెట్టాయని శోకాలు పెట్టేవాడు. పథకం ప్రకారమే తన కొంపను ముంచాలనే కుట్ర పన్నారని కుల మీడియాలో గంటలు గంటలు చెప్పించేవాడు” అంటూ   చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *