స్టాలిన్ ను కలిసే దాకా నిద్రపోరని చంద్రబాబుపై విజయసాయి కౌంటర్

VIJAY SAI COUNTER ON CHANDRABABU

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏ కాస్త అవకాశం ఉన్నా వాగ్బాణాలు సంధిస్తున్నారు. విమర్శల వర్షం కురిపిస్తున్నాడు . తాజాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్… డీఎంకే అధినేత స్టాలిన్ ని కలిసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై చంద్రబాబుపై విజయసాయి విమర్శలు చేశారు.

‘‘స్టాలిన్ ను కెసీఆర్ కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారని మీడియాలో వచ్చింది. ఇక చంద్రం సారుకు నిద్ర పట్టదు. స్టాలిన్ ను తనూ కలిసి అటువంటిదేమి లేదు అని ప్రకటించేదాకా ఊరుకోడు. 2 ఎంపీ సీట్లు కూడా కష్టమేనని తెలిశాక ఎవరు లెక్కచేస్తారు ఈయన పిచ్చి కాకపోతే.’’ అంటూ సెటైర్ వేశారు.ఇక్కడితో ఆగలేదు… చంద్రబాబు సర్వేలపై కూడా కౌంటర్లు వేశారు. ఏపీలో ఎన్నికలపై నాలుగు సర్వేలు చేయించగా… అన్ని సర్వేల్లో టీడీపీదే అధికారం అని వచ్చిందని చంద్రబాబు చేసిన కామెంట్స్ పై విజయసాయి రెడ్డి కౌంటర్ వేశారు.‘‘గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారు చంద్రబాబూ? ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయండి. ఎన్నికలు ఐదేళ్లకోసారొస్తాయి. పార్టీ శాశ్వతం. మేలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి ఇబ్బంది పెట్టాలని చూశారు లాంటి శోకాలెందుకు?’’ అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *