జగన్ కు బాసటగా

Vijayama Helping Jagan .. ఎన్నికల ప్రచారంలో విజయమ్మ , షర్మిల

ఏపీ ఎన్నికల్లో జగన్ కు బాసటగా మేము సైతం అంటున్నారు విజయమ్మ, షర్మిల. వైసీపీ తరపున వీరు ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిద్ద‌రూ విడివిడిగా జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం రోజుకు నాలుగు స‌భ‌లు నిర్వహించేందుకు వైసీపీ పెద్దలు ప్లాన్స్ చేస్తున్నారు. వేర్వేరుగా రెండు బస్సులను సిద్ధం చేస్తున్నారు. 2012లో ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ జైళ్లో ఉండడంతో వీరిద్ద‌రూ ప్రచార బాధ్యతలను భుజాన ఎత్తుకున్నారు. అభ్యర్థుల తర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు. 2014 ఎన్నిక‌ల స‌మయంలోనూ ఎలక్షన్ క్యాంపెయన్ చేశారు విజయమ్మ, షర్మిల.
ఉత్తరాంధ్ర నుండి ఇచ్చాపురం వరకు జగన్ సోదరి షర్మిల ప్రచారం చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్..వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 27వ తేదీ బుధవారం ముహూర్తం ఫైనల్ చేశారు. 10 జిల్లాలు, 50 నియోజకవర్గాలు కవర్ చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు.
జగన్ తల్లి విజయమ్మ విషయానికి వస్తే…రాయలసీమ నుండి ప్రచారం స్టార్ట్ చేయనున్నారు. మొత్తం 40 నియోజకవర్గాల్లో ఆమె చేత ప్రచారం చేయించాలని భావిస్తోంది పార్టీ. రోడ్ షోలు, బస్సు యాత్రలు నిర్వహించి పార్టీకి మద్దతుగా ప్రచారం విజయమ్మ ప్రచారం చేయనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి జగన్ ప్రచారం స్టార్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో మూడు నుండి నాలుగు సభలు నిర్వహిస్తూ ప్రచార పర్వంలో దూసుకపోతున్నారు జగన్. ఎన్నికల పోలింగ్‌కు తక్కువ సమయం మాత్రమే ఉంటుంది కనుక..వీలైనన్నీ నియోజకవర్గాలు కవర్ చేయాలని వైసీపీ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *