ఆ కోడెలను ఇకనైనా దొడ్లో కట్టేయండి..

Spread the love

VIJAYASAI REDDY COMMENTS ON TDP

వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టిడిపి నాయకుల పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. వైసిపి నేత విజయసాయి రెడ్డి ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ కలిసి ఆ కోడెల సంగతి చూడండి అంటూ అటు చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేసి కోడెల వ్యవహారంలో జరుగుతున్న రగడ పై నిర్ణయం తీసుకోవాలంటూ సెటైర్ వేశారు. అంతేకాదు ఐదేళ్లు ఆంబోతుల జనం పైకి వదిలారు కోడెల గుంపు పొడిచి, తన్నని వారే లేరు. ఇకనైనా దొడ్లో కట్టేయండి లేదంటే తరిమేయండి అంటూ వ్యాఖ్యానించారు. అది కూడా వీలు కాదు అంటే మరో నాలుగు రోజుల్లో గుదె కట్టి గుంజలకు కట్టేయక తప్పదు ప్రభుత్వానికి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయ్ సాయి రెడ్డి. ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఆయన చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు.

ఓటు వేయకపోతే ఇల్లు కూలుస్తారా అంటూ చౌకబారు వ్యాఖ్యలు మీకే సాధ్యం చంద్రబాబు గారు అంటూ వ్యాఖ్యానించిన విజయసాయి మా ఎమ్మెల్యేలను గెలిపించండి చోట రూపాయి కూడా ఇవ్వమని సిగ్గు లేకుండా చెప్పిన చరిత్ర మీది అంటూ ఘాటుగా విమర్శించారు. పార్టీలకతీతంగా ప్రజలందరినీ ఒకేలా చూస్తామని చెప్పిన జగన్ గారి హుందాతనం మీకు ఎప్పటికీ రాదంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ఇక అక్కడితో ఆగినా విజయసాయి దేవినేని ఉమా పై విరుచుకుపడ్డారు. దేవినేని ఉమా సిమెంటు దుకాణాల నుండి బస్తాకు 5 రూపాయలు వసూలు చేయాలని వైసీపీలో ఉన్న దుష్ట చతుష్ఠయం ప్రయత్నం చేసిందని, అందుకే ఇసుక కొరత సృష్టించి నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తోందని విమర్శలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలకు సమాధానంగా విజయసాయి ఎంతో దిగజారావు ఉమా ? ఊహ కల్పనలకు కూడా ఒక హద్దు ఉండాలి. సిమెంట్ కంపెనీలు బస్తాకు ఐదు రూపాయిలు ఇవ్వనందుకే ఇసుకసరఫరా ను ఆపేశామా… నీతో సహా ఇసుక బకాసురులు పదివేల మంది ఒక్కొక్కరు వంద కోట్లకు పైగా దోచుకున్నారు. అలాగే వదిలెయ్యక కొత్త పాలసీ ఎందుకు తెస్తున్నారనేదే కదా నీ బాధ అంటూ దేవినేని ఉమా పై ఎదురు దాడి చేశారు.

TOMOTA RATES IN PAK INCREASE

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *