కేసీఆర్ కాళ్ళు మొక్కిన విజయ్ సాయి రెడ్డి

Vijayasai Reddy Touches KCR’s Feet

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్, సీఎం జగన్ ల భేటీ మాట అటుంచితే వీరి భేటీ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.  జగన్‌కి పుష్ప గుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్ జగన్‌తో కలిసి భోజనం చేశారు. అయితే పలు రాజకీయ సమస్యలు , విభజన సమస్యలు, గోదావరి జలాల అంశాలపై చర్చించేందుకు జగన్ కేసీఆర్‌ని కలిశారు . అయితే ఈ సీఎం జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.అయితే జగన్‌తో మాట్లాడిన సీఎం కేసీఆర్, అనంతరం విజయసాయి రెడ్డిని కూడా పలకరించబోయారు.  ఇక  విజయసాయి రెడ్డి వెంటనే కేసీఆర్ దగ్గరకు వచ్చి పాదాభివందనం చేసేందుకు ముందుకు వంగారు. అయితే కేసీఆర్ ఆయనను ఆపేందుకు ప్రయత్నించినా కూడా పాదాలను తాకి విజయసాయి రెడ్డి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే వీరి పక్కనే ఉన్న జగన్, కేటీఆర్ విజయసాయికి పెద్దలపై ఉన్న అభిమానానికి ఫిదా అయ్యారు. ఏదేమైనా ఈ ఒక్క పనితో అటు కేసీఆర్, జగన్ వద్ద విజయసాయి మంచి మార్కులే కొట్టేశారని చెప్పాలి. కానీ  ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీగా ఉండి తెలంగాణా రాష్ట్ర సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Vijayasai Reddy Touches KCR’s Feet,Andhra pradesh, telangana, cm kcr, cm jagan mohan reddy, vijayasai reddy , kcr blessings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *