వికారాబాద్ ఎస్పీ నారాయణపై వేటు?

6
Vikarabad SP Suspend?
Vikarabad SP Suspend?

VIKARABAD SP SUSPEND?

డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.

అవినీతి ఆరోపణలు సిబ్బందిపై వేధింపులే కారణం..

కొత్త ఎస్పీగా జానకి షర్మిల..

అవినీతి ఆరోపణలు క్రింది స్థాయి సిబ్బందిని వేధించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణపై పోలీసు ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనను డిఐజి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎస్పీగా జానకి షర్మిలను నియమించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఎస్పీ తీరుపై విమర్శలు రావడంతో డిఐజి కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. ఇంటలిజెన్స్ అధికారులు వారం రోజులుగా తాండూరు వికారాబాద్ లో గోప్యంగా విచారణ జరిపినట్లు సమాచారం. నివేదికను డిజిపి కార్యాలయనికి అందజేయ్యడం తో వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం.  ఇసుక దందాను ఎస్పీ ప్రోత్సహించారనే ఆరోపణలతో పాటు పలు సివిల్ కేసుల్లో తలదూర్చారనే పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లలోని ప్రతి పెట్రోల్ బాంకుల్లో నెలకు 25 లీటర్ల చొప్పున డీజిల్ తీసుకొని సదరు ఇందనానికి సంబంధించిన బిల్లులను సర్కార్ నుంచి సుమారు 75 లక్షలు కాజేశారనే విమర్శలూ ఉన్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు.

Telangana Police Updates