నాగ చైతన్యకు ముందు భయపెడతానంటోన్న దర్శకుడు

3
vikram kumar movie
vikram kumar movie

vikram kumar movie

ఇంటలెక్చువల్ డైరెక్టర్ అని అందరికీ పేరు రాదు. వచ్చినవాళ్లు తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో విక్రమ్ కుమార్ ఒకడు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన విక్రమ్ కొన్నాళ్లుగా మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం మరోసారి నాగచైతన్య హీరోగా సినిమాకు సిద్ధమవుతున్నాడు. అయితే దీనికంటే ముందే అతను ఓ హారర్ మూవీ చేయబోతున్నాడు అంటున్నారు. అంటే హారర్ బిఫోర్ లవ్ స్టోరీ అన్నమాట. తెలుగులో ఇష్క్ సినిమాతో చాలా ఎక్కువమందిని ఆకట్టుకున్నాడు విక్రమ్ కుమార్..  అయితే అతను అంతకు ముందే మాధవన్, నీతూ చంద్ర, సచిన్ ఖేద్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. మోస్ట్ అండర్ రేటెడ్ హారర్ మూవీ అనిపించుకున్న చిత్రం ఇది. ఈ తరం ఆడియన్స్ ను సైతం మెస్మరైజ్ చేసే కంటెంట్ ఉన్న మూవీ. అలాంటి సినిమా తర్వాత అతను ప్యూర్ లవ్ స్టోరీ అంటూ ఇష్క్ తో రావడం విశేషం.

అలాగే ఆ తర్వాత చేసిన మనం సైతం తెలుగు ప్రేక్షకులను సూపర్ థ్రిల్ చేసింది. వైవిధ్యమైన కథలు చెప్పడంలోనే ఇంట్రెస్ట్ చూపించే దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. ఆ క్రమంలో అతను చెప్పిన 24, హెలో, గ్యాంగ్ లీడర్ కథలు అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూడు సినిమాలు కమర్షియల్ గా లాస్ లే చూశాయి. ఈ క్రమంలో నాగచైతన్య, సమంత జంటగా ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చెప్పి ఒప్పించాడు అనే వార్తలు వచ్చాయి. అవి నిజమే. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఈ లోగా మరోసారి ఓ హారర్ స్టోరీ చేయబోతున్నాడట. అంటే 13బి తర్వాత అతను చేస్తోన్న హారర్ కంటెంట్ ఇదే అవుతుంది. మరి ఇది సినమానా లేక వెబ్ సిరీసా అనేది ఇంకా తేలాల్సిన విషయం కావడం ట్విస్ట్ అన్నమాట.

tollywood news