విక్రమ్ ల్యాండర్ లో కదలికలు?

Spread the love
vikramlander latest updates

చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్, బలంగా గుద్దుకోవడంతో దాన్నుంచి సంకేతాలు నిలిచిపోయాయి.  ఈ పరిణామం ఇస్రో వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో, ఇస్రోతో కుదిరిన ఒప్పందం మేరకు నాసా రంగంలోకి దిగింది.చందమామ ఉపరితలంపై దిగిన అనంతరం జాడ తెలియరాకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ కోసం ఇక ఏకంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలో దిగింది. హలో అంటూ ఏకధాటిగా జాబిల్లి మీదికి ఏకధాటిగా సంకేతాలను పంపిస్తోంది. డీప్ స్పేస్ యాంటెన్నాల ద్వారా చంద్రుడి మీదికి నాసా సంకేతాలను పంపిస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔత్సాహిక అంతరిక్ష పరిశోధకుడు స్కాట్ టిల్లీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. స్పెయిన్ లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని క్యాన్ బెర్రా, కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ ప్రాంతాల్లో నాసాకు డీప్ స్పేస్ స్టేషన్ యాంటెన్నాలు ఉన్నాయి. వాటి ద్వారా హలో అనే సంకేతాలను పంపిస్తున్నట్లు తెలిపారు. చంద్రుడిపై అచేతనంగా పడివున్న విక్రమ్ ల్యాండర్ లో కదలిక తెచ్చేందుకు నాసా భారీ టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (జేపీఎల్) తమ డీప్ స్పేస్ నెట్ వర్క్ కేంద్రాల నుంచి విక్రమ్ ల్యాండర్ కు శక్తిమంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపిస్తోంది. 24 బీమ్స్ 12 కిలోవాట్ల శక్తితో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీని చంద్రుడి ఉపరితలంపైకి పంపగా, అది తిరిగి భూమిని చేరిందని నాసా వర్గాలు తెలిపాయి. విక్రమ్ ల్యాండర్ జీవితకాలం కేవలం 14 రోజులు మాత్రమే. ల్యాండర్ ను సూర్యకిరణాలు కొన్నిరోజుల పాటు మాత్రమే తాకుతాయి. ఈ లోపే సోలార్ ప్యానెళ్లను చార్జ్ చేస్తే తప్ప విక్రమ్ ల్యాండర్ ఉత్తేజం పొందదు. ఈ అంశమే ఇస్రో వర్గాలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది.
VIKRAM LANDER
Tags :  Chandrayaan-2, ISRO, NASA, vikram lander, charge , solar panels

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *