విక్రమ్ పై ఆశలు అడియాశలేనా?

ISRO LOST HOPE ON VIKRAM?

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ కు కమ్యూనికేషన్ కట్ అయ్యింది.  సాఫ్ట్ ల్యాండింగ్ లో ఇబ్బందులు ఎదురు కావటంతో  సంకేతాలు అందకపోవటం మన శాస్త్రవేత్తలను ఆవేదనకు గురి చేసింది.  దీనికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పటివరకూ ఏ ఒక్క  ప్రయత్నమూ ఫలించలేదు. ఈ ప్రయత్నాలకు ఇవాళే ఆఖరు రోజు అనే భావన వ్యక్తం అవుతుంది. వచ్చేది శీతాకాలం కావటంతో ఇక విక్రమ్ కమ్యూనికేషన్  ఇప్పుడు కాకుంటే సాధ్యం కాదని నాసా అభిప్రాయం .
ఇదిలా ఉంటే నాసాకు చెందిన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ విక్రమ్ పడిన ప్రాంతాన్ని ఫోటోలు తీసింది. అయితే.. అందులో విక్రమ్ జాడ లభించలేదు. అయితే.. మరికొన్ని వార్తా సంస్థలు మాత్రం విక్రమ్ ల్యాండర్ ను నాసా పసిగట్టిందని.. ఇందుకు సంబందించిన ఫోటోల్ని విడుదల చేసినట్లుగా వార్తలు ఇచ్చాయి. ఏది ఏమైనా విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందుకోవటానికి ఈ రోజు (శుక్రవారం) మాత్రమే మిగిలి ఉందని చెప్పాలి. ఈ రోజుతో విక్రమ్ తో సంబందాలకు అవకాశం లేకపోగా.. శాశ్వతంగా దాని మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి.
ఎందుకంటే.. చంద్రుడిపై 14 రోజులు పగలు ఉంటే.. మరో 14 రోజులు రాత్రి ఉంటుంది. అది ఇవాల్టితో ముగుస్తుంది. పగటి వేళ ఉండే ఉష్ణోగ్రతలకు రాత్రిళ్లు ఉండే ఉష్ణోగ్రతకు ఏ మాత్రం సంబంధం ఉండదు. చంద్రుడి దక్షిణాదిన చీకటి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 240 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతుంది. విక్రమ్ ల్యాండర్ ను అంత చలిని తట్టుకునేలా తయారు చేయలేదు. దీంతో.. విక్రమ్ ల్యాండర్ పాడైపోవటం ఖాయం. ఈ నేపథ్యంలో సంకేతాలు అందుకోవటానికి ఇదే ఆఖరు రోజుగా  భావిస్తున్నారు. ఇవ్వాళ సంకేతాలు అందితే ఓకే.. లేకుంటే బాధాతప్త హృదయంతో విక్రమ్ ల్యాండర్ కు సెలవు చెప్పాల్సిందే.

ఏపీలో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం !

tags : ISRO, NASA, Winter, Moon,  Vikram Lander

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *