VINARA SODARA VEERA KUMARA REVIEW

Spread the love

VINARA SODARA VEERA KUMARA REVIEW

బ్యాన‌ర్‌:  ల‌క్ష్మ‌ణ్ సినీ విజ‌న్స్‌
తారాగ‌ణం:  శ్రీనివాస‌సాయి, ప్రియాంక జైన్‌, ఝాన్సీ, ఉత్తేజ్‌, జెమినీ సురేష్ త‌దిత‌రులు
కెమెరా:  ర‌వి.వి
సంగీతం:  శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌
మాట‌లు:  ల‌క్ష్మీ భూపాల్‌
ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేష్‌
నిర్మాత: లక్ష్మణ్ క్యాదారీ
దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ల
ల‌క్ష్మ‌ణ్ సినీ విజ‌న్స్ ప‌తాకంపై శ్రీనివాస సాయి, ప్రియాంక జైన్ నాయ‌కానాయిక‌లుగా సతీష్ చంద్ర నాదెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `విన‌రా సోద‌ర వీర కుమారా`. ఈ సినిమాకు ల‌క్ష్మ‌ణ్ క్యాదారీ నిర్మాత‌. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. మ‌రి విలేజ్ బ్యాక్‌డ్రాప్  ప్రేమ క‌థ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందో చూద్దాం…
క‌థ‌:
ర‌మ‌ణ‌(శ్రీనివాస్ సాయి) ఆటో డ్రైవ‌ర్‌.. త‌న గ్రామంలో ఇంజ‌నీరింగ్ చదివే అమ్మాయి సులోచ‌న‌(ప్రియాంక జైన్‌)ను ప్రేమిస్తాడు. అయితే సులోచ‌న మాత్రం ర‌మ‌ణ‌ను ప్రేమించ‌దు. ర‌మ‌ణ ఆమె ప్రేమ కోసం వెన‌క‌నే తిరుగుతుంటాడు. ఓ సంద‌ర్భంలో సులోచ‌న బావ ర‌మ‌ణ‌ను చావ‌గొడ‌తాడు కూడా. చాలా ఇబ్బందులు ప‌డ్డ త‌ర్వాత సులోచ‌న ర‌మ‌ణ‌ను ప్రేమిస్తుంది. కానీ త‌న బావ‌నే పెళ్లి చేసుకుంటాన‌ని భీష్మించుకుని కూర్చుంటుంది. ఈలోపు రమ‌ణ త‌న స్నేహితుడి కోరిక‌ను తీర్చ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. ఇంత‌కు ర‌మ‌ణ స్నేహితుడెవ‌రు?  అత‌ని కోరిక ఏంటి?  చివ‌ర‌కు ర‌మ‌ణ స్నేహితుడి కోరిక‌ను తీర్చాడా?  లేదా? అనేది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే…
విశ్లేష‌ణ‌:
ప్రేమ క‌థ‌ల్లో హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌ను ఎంత కొత్త‌గా ఎలివేట్ చేశాం. స‌న్నివేశాలు ఎంత బ‌లంగా ఉన్నాయ‌నే దానిపై ఆధార‌ప‌డి సినిమా ర‌న్ అవుతుంది. ఈ మ‌ధ్య ప్రేమ క‌థ‌ల్లో రొమాన్స్ డోస్ కూడా ఎక్కువైంది. అయితే విన‌ర‌సోద‌ర వీర‌కుమారా చిత్రంలో ఈ అంశాల‌తో పాటు ప్రేమికుల‌కు, వారి పేరెంట్స్‌కు ద‌ర్శ‌కుడు స‌తీష్ చంద్ర‌ ఓ మెసేజ్ ఇచ్చాడు. క‌థ‌నం ఆక‌ట్టుకుంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే మంచి ప్రేమ‌క‌థ‌. హీరో శ్రీనివాస్‌, హీరోయిన్ ప్రియాంక జైన్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు బావున్నాయి. ఇద్ద‌రూ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. ఇటు పిల్ల‌ల‌కు.. అటు త‌ల్లిదండ్రుల‌కు మంచి మెసేజ్‌ను ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు స‌తీష్ చంద్ర‌. హీరో శ్రీనివాస్ సాయి ఎన‌ర్జిటిక్‌గా న‌టించాడు. త‌న న‌ట‌న‌లో ఈజ్ ఉంది. ఇక ప్రియాంక జైన్ అంద‌మైన పల్లెటూరి అమ్మాయిలా ఆక‌ట్టుకుంది. ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమినీ సురేష్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు స‌తీష్ చంద్ర‌కు ల‌క్ష్మీ భూపాల్ మాట‌లు వెన్నుద‌న్నుగా నిలిచాయి. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
బోట‌మ్ లైన్‌: ప‌్రేమ కోసం ప్రాణాలు వ‌దిలేయ‌డం ముఖ్యం కాదు.. అనే మెసేజ్‌తో `విన‌ర‌సోద‌ర వీర‌కుమారా` ఆక‌ట్టుకుంటుంది
రేటింగ్‌: 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *