అనుష్కా.. అన్నం తిన్నావా?

#Virushka Viral vedio#

ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కాశర్మ ప్రేమయాణం అందరికీ తెలిసిందే. అనుష్కాపై కోహ్లీ, కోహ్లీపై అనుష్కా ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. అది క్రికెట్ గ్రౌండ్ అయినా, మైదానం బయట అయినా. తమ గురించి ఎవరేం అనుకుంటారో అని పట్టించుకోకుండా తమకు నచ్చినట్టుగా ఉంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది.

ఐపీఎల్ మ్యాచ్‌లు అబూదాబీలో జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీకి తోడుగా అనుష్క శర్మ కూడా అబూదాబీ వచ్చారు. ఆర్బీసీ, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. విరాట్… అనుష్కకు సైగలు చేస్తూ భోజనం చేశావా? అని అడిగాడు. దీనికి అనుష్క సమాధానంగా తన బొటనవేలిని చూపిస్తుంది. దీనిని చూసిన విరాట్ ముసిముసిగా నవ్వుతాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

(‘టీవీయూ అప్‌డేట్స్’ వీడియో)

https://youtu.be/scsyMkuzbH4

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *