స్నేహితులే శత్రువులైన విశాఖ రాజకీయం

Vishaka Politics Friends Become Enemies

విశాఖలో ఒకప్పటి స్నేహితులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఏపీ లో ఇప్పుడు తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు, తాజా మంత్రి అవంతి శ్రీనివాసరావు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావును తాను మంత్రిగా చూడడం లేదని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానిస్తే అసలు గంటా శ్రీనివాసరావు తన మనిషిగానే చూడడం లేదని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇంకా గంటా శ్రీనివాసరావు మంత్రి అన్న భ్రమలోనే ఉన్నారని మండిపడిన అవంతి, తన జోలికి వస్తే విశాఖలోనే ఉండకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. ఇక గంటా బాగోతం అంతా బయట పెడతానన్న అవంతి నెల్లూరు మెస్ లో టికెట్లు అమ్ముకున్న బాగోతం తమకు తెలుసంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక అంతే కాదు పార్టీలు మారడం బాగా అలవాటైన గంటా తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడుని అణగదొక్కారని, కానీ తాను అయ్యన్నపాత్రుడు అంత మంచోడిని కాదని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.

అసలు గంటా శ్రీనివాసరావు అవంతి మీద కోపంగా ఉండటం వెనుక అసలు కారణం ఏంటంటే గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీ లోకి రావాలని చాలా ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా గంటా స్థానంలో అవంతి శ్రీనివాస్ వైసిపి లో చేరి ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయన జగన్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఇక గంట విషయానికొస్తే ప్రజారాజ్యం పార్టీ నుండి విజయం సాధించిన గంటా, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన టిడిపి నుండి కూడా మంత్రిగా పని చేశారు. ఇక వైసీపీ లో చేరి ఆయన పార్టీ మారితే మంత్రి అయ్యేవారే. కానీ అవంతి శ్రీనివాసరావు ఆ ప్లేస్ లోకి రావడం వల్ల గంటా ప్లాన్ మారిపోయి ఇప్పుడు ఏ పదవి లేకుండా టీడీపీ లో కొనసాగుతున్నారు.
ఇప్పటికే అసహనంతో ఉన్న గంటాను విశాఖ భూకుంభకోణం లోనూ, అలాగే గంటా కు సంబంధించిన అక్రమ నిర్మాణాల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం ఇరకాటంలో పెడుతోంది. దీంతో గంటా శ్రీనివాస్ వైసీపీ వైపు చూస్తున్నాడు అన్న వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఇక దీనిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి గంటా రావాలనుకున్నా జగన్ ఎపుడో గేట్లు మూసేశారని అవంతి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. గంటాకు వైసీపీలో నో ఛాన్స్ అని తేల్చి చెప్పేశారు. దానికి రిటార్ట్ అన్నట్లుగా గంటా కూడా గట్టిగానే మాట్లాడారు. అసలు ఆయన్ని తాను మంత్రిగా గుర్తించను అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో భగ్గుమన్న అవంతి గంటా శ్రీనివాసరావుపై ఘాటైన విమర్శలు చేశారు . ఒకప్పుడు టీడీపీలో ఇద్దరు మిత్రులు ఒక మంచి అవగాహనతో కలసి మెలసి పార్టీ కోసం పని చేశారు. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. విలువ తీసుకుంటున్నారు.

Janapriya Urban Farms

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *