Vitamins food beat the corona
కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు సరైన వాక్సిన్ రాలేదు. వాక్సిన్ వచ్చే వరకు కరోనాను ఎదుర్కొలేమా అంటే? సరైన పోషకాలు తీసుకుంటే కరోనాను తరిమివేయవచ్చు అంటున్నారు డైటిషీయన్లు.
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలు రోగనిరోధకశక్తిని పెంచి కరోనా సోకినా, శరీరం మీద దాని ప్రభావం తగ్గించడానికి తోడ్పడతాయి. కాబట్టి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పోషకాహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ పప్పుధాన్యాలు, సీజన్వారీ కూరగాయలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, చర్మం తొలగించిన చికెన్, చేపలు పరిమితంగా తీసుకోవాలి. పొట్టు తీయని ధాన్యాలు పిండిపదార్థాలు, మాంసకృత్తులను సమకూరుస్తాయి. కూరగాయలు, పండ్ల ద్వారా విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ప్రతి రోజూ నట్స్ తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నట్స్, నూనెతో కూడిన విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి. అలాగే కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, సూప్స్, పుదీనా నీళ్లు, జీలకర్ర నీళ్లు లాంటి పానీయాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సాధ్యమైనవంతవరకు కరోనాకు దూరంగా ఉండొచ్చు.