8జీబీ ర్యామ్, భారీ కెమెరా

VIVO V15 PRO LAUCH

  • వీవో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్
  • వివో వి15 ప్రో హై ఎండ్ మోడల్ ఆవిష్కరణ

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వీవో సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఏకంగా 8 జీబీ ర్యామ్ తో ఈ ఫోన్ తీసుకొచ్చింది. వీవో వి15 ప్రో ఫోన్ ను కాస్త మార్చి హై ఎండ్ మోడల్ ను రూపొందించి తాజాగా లాంచ్ చేసింది. 6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతోపాటు 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడిన ఈ ఫోన్ ను సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్ కెమెరా కూడా భారీగానే ఉంది. 32 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన పాపప్ సెల్ఫీ కెమెరాతోపాటు 48 + 8 + 5 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఏర్పాటు చేసింది. ఎన్నో అద్భుత ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధరను రూ.29,990గా నిర్ధారించింది.

వివో వి 15 ప్రొ ఫీచర్లు ఇవే…
6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 9.0పై
2340 x 1080 పిక్సెల్స్‌ స్ర్కీన్‌ రిజల్యూషన్‌
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 675 ప్రాసెసర్
8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్ పాండబుల్ మెమోరీ
48+8+5 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ పాపప్ కెమెరా
3700 ఎంఏహెచ్ బ్యాటరీ

MOBILE MARKET

Purchase it On Online and Price details of  VIVO V15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *