వివో నుంచి సెల్ఫీ పాపప్ కెమెరా ఫోన్

VIVO V15 PRO RELEASE

  • భారత మార్కెట్లోకి వి15 ప్రో విడుదల
  • 6 నుంచి అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ లలో విక్రయాలు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో ఓ సరికొత్త ఫోన్ తో మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా 32 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన పాపప్ సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. వివో వి15 ప్రొ పేరుతో కొత్త మొబైల్ ఫోన్ ను బుధవారం భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. వెనుకవైపు మూడు కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా పొందుపర్చింది. దీని ధరను  ధర రూ.28,990గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా మార్చి 6 నుంచి ఈ ఫోన్ విక్రయాలు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది.

వివో వి15 ప్రొ ఫీచర్లు
6.39 అంగుళాల అమోలెడ్ అల్ట్రా ఫుల్ వ్యూ డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
48+5+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా
32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా
3,700 ఎంఏహెచ్ బ్యాటరీ

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *