వీఆర్ఓకు ఎమ్మెల్యే బెదిరింపులు

2
Vro complaint Against Qutubllapur Mla
Vro complaint Against Qutubllapur Mla

Vro complaint Against Qutubllapur Mla

కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద బెదిరింపులకు పాల్పడుతున్నాడని గాజుల రామారం వీఆర్ఓ శ్యాం ఆరోపించారు. విధినిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను కూల్చేసినందుకు ఎమ్మెల్యే నుంచి బెదిరింపులు వచ్చాయని అన్నారు. అందుకు సంబంధించిన ఆడియో టేప్ లు కూడా తన దగ్గర ఉన్నాయని అన్నారు. ఆడియో టేపులను పోలీసులను అందించానని తెలిపారు. ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్లో వీఆర్ఓ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.