తెలంగాణా ఆర్టీసీ లో వీఆర్ఎస్

VRS In Telangana RTC

తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంలో ప్రభుత్వం కొత్త ఆలోచనల దిశగా అడగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులకు వీఆర్ ఎస్ ఇచ్చి ఇంటికి పంపే ప్లాన్ పై కసరత్తు చేస్తుంది.  సమ్మె పైన ఇప్పటికే కార్మికులు తమ ప్రధాన డిమాండ్ గా చెప్పుకుంటూ వచ్చిన.. ప్రభుత్వంలో విలీనం పైన వెనక్కు తగ్గారు. ఇప్పటికైనా చర్చలకు పిలవాలని కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం మరింత కాలం సమ్మె చేయలేరని వారు వెనక్కు తగ్గుతారనే అంచనాతో ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 5100 ప్రయివేటు బస్సులను పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ కార్మికుల మీద ఒత్తిడి పెంచింది. దీంతో పాటుగా.. 43 రోజులు అయినా సమ్మె ఆగక పోవటంతో కొత్త నిర్ణయాలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో..ఆర్టీసీ కార్మికులకు స్వచ్చంద పదవీ విరమణ పధకం అమలు చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం దీనిని ఇంకా బయట పెట్టకపోయినప్పటికీ.. ఎప్పటికైనా ఆర్టీసీ లో ప్రవేటు భాగస్వామ్యం కావాల్సిందే అంటూ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తెగని పంచాయితీగా మారింది. ప్రభుత్వం..కార్మికులు ఎవరికి వారు మెట్టు దిగకపోవటంతో సమ్మె కొనసాగుతోంది. దీంతో..ప్రభుత్వం కొత్త ఆలోచనలకు రూప కల్పన చేస్తోంది. అందులో భాగంగా..తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విషయంలో స్వచ్చంద పదవీ విరమణ అంశం పైన కసరత్తు చేస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండటంతో..ఈ సమయం లో కొత్త నిర్ణయాలు ప్రకటించలేరు. కోర్టు ఆర్టీసీ విషయంలో ఇచ్చే తీర్పు కార్మికులకు అనుకూలంగా ఉంటే సుప్రీంకు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇక, ఇదే సమయంలో కార్మికు ల మీద ఒత్తిడి పెంచటానికి స్వచ్చంద పదవీ విరమణ ప్రతిపాదన దిశగానూ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులోనూ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలతో రావాలని భావిస్తోంది. ప్రభుత్వం ఆలోచన చేస్తున్న స్వచ్యంద పదవీ విరమణ పధకం అమలు చేస్తే..దాదాపు 27 వేల మంది కార్మికుల పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే, సంస్థ మనుగడను పరిగణలోకి తీసుకొని అటు సంస్థకు..ఇటు ఉద్యోగులకు నష్టం లేకుండా ఈ ప్రతిపాదన తెర మీదకు తెస్తున్నామని చెప్పుకొనే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం బీఎస్ఎన్ఎల్ లో ఇదే రకంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల నుండి అనూహ్య స్పందన వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే, కోర్టుల్లో ఉన్న ప్రస్తుత వ్యవహారం పైన ఒక స్పష్టత వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ ప్రతిపాదన మీద అడుగులు ముందుకు వేసే పరిస్థితి కనిపిస్తుంది.

tags : tsrtc strike, rtc strike, rtc workers, telangana government, cm kcr, VRS, voluntery retirement scheme, high court, privatisation

ప్రజలను మోసం చేయడంలో కెసిఆర్ దిట్ట అన్న డీకే అరుణ

టీడీపీ నుండి వల్లభనేని వంశీ సస్పెన్షన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *