water supply to 11500 acres in summer
- వేసవిలో 11500 ఎకరాలకు సాగు నీరు
- ఆత్మహత్యల నుంచి ఆత్మవిశ్వాసం వైపు
కాలం తో పని లేదు.. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి అనే మాట నిజం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుదని చెప్పడానికి నిదర్శనం సిద్దిపేట నియోజకవర్గంలోని చెరువులు నిండటమే. ఒక వైపు ఎండలు మండుతున్నాయ్ ..మరో వైపు మత్తళ్ళు దుంకుతున్నాయ్.. కాలం కానీ కాలంలో మండే ఎండల్లో మత్తళ్ళు దుంకడం అంటే ఇది ఒక చరిత్ర నే. గత నెలలో సీఎం కేసీఆర్పు ట్టిన రోజు కానుకగా రంగనాయక సాగర్ నుండి యాసంగి పంటకు సాగునీరు అందించాలని సంకల్పంతో మంత్రి హరీష్ రావు నీరు విడుదల చేశారు. ఆ దిశగా గోదావరి జలాలు కాలువల ద్వారా చెక్ చెక్ డ్యామ్ లు , చెరువుల కు చేరి మత్తళ్ళు పంట పొలాలకు పరవళ్ళు తొక్కుతున్నాయ్.. రైతుల కళ్లలో ఆనందం వెల్లువిరుస్తుంది.
ఎండ కాలం వచ్చిందంటే బావులు ఎండటం.. రైతుల మొహాలు మొగులు వైపు చూసే కాలం.. ఆత్మహత్యల, రైతు పొలాల్లో ఉరితాళ్ళు అనే దుస్థితి ఉండేది. అలాంటిది కాలంతో పని లేదు కాళేశ్వరం నీళ్లు వచ్చాయి అని రైతు గర్వంగా చెప్పుకుని రోజులొచ్చాయ్. తొలిసారిగా యాసంగి పంటకు నీళ్లు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాసంగి పంటకు ప్రధాన కుడి కాలువ ద్వారా 3500 ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ ద్వారా 8000 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో, ఇక్కడి గ్రామస్థులు కేసీఆర్, హరీష్ రావు చిత్రపటాలకు నీలాభిషేకం చేశారు.