ఖమ్మం అభివృద్ధి జరగాలి

13

KHAMMAM SHOULD DEVELOP

౼ కేంద్రం తీసుకోవటమే కాని ఇచ్చింది లేదు … అయినా అభివృద్ధి ఆగలేదు.
౼ తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతోనే అభివృద్ధి సాధ్యమైంది.
౼ ఐటీ హబ్-2కు శంకుస్థాపన, మోడరన్ బస్ స్టేషన్ ప్రారంభం.
౼ ఖమ్మం నగర అభివృద్ధి తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందనికేటీఆర్ ప్రసంశలు

ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం, సత్తుపల్లిలలో వివిధ కారక్రమాలలో బిజీబిజీ గా పాల్గొన్నారు. ఈ సందర్భగా నూతన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు.
తొలుత రూ.36 కోట్లతో నిర్మించనున్న 2వ దశ ఐటీ హబ్ (it Tower) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ నుండి 48వ డివిజన్లలలో రూ.30 కోట్లు SDF నిధులతో సిసి, బిటి రోడ్ల పునరుద్ధరణ పనులు మరియు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీశ్రీ సర్కిల్ నుండి వివి పాలెం వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న ఫోర్ లైన్(BT) రోడ్డు విస్తరణ పనులకుబిశంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో ఒకే సముదాయంలో 1000 పేదల డబుల్ ఇళ్లను ప్రారంభించి, అనంతరం నగర పాలక సంస్థ పరిధిలోని 45వేల నూతన కనెక్షన్లు, 85వేల పాత కనెక్షన్స్ ద్వారా ప్రతి రోజు ఇంటికి మంచినీటి సరఫరను ప్రారంభించారు. రూ.2కోట్ల తో కాల్వఒడ్డులో ఆధునీకరించిన వైకుంఠధామంను ప్రారంభించారు. అనంతరం రూ.25 కోట్లతో నిర్మించించిన అధునాతన ఆర్టీసీ బస్ స్టాండ ను ప్రారంభించారు.

* మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల చూపుతున్న పక్షపాతంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం మన దగ్గర తీసుకోవడమే కానీ ఇవ్వడంలేదని ఆరోపించారు. విభజన చట్టంలో చెప్పింది ఏదీ కేంద్రం అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లేనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, దేశ అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.

* తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పెట్టుబడుల అంశంపై చాలా మందిలో అస్పష్టత ఏర్పడిందని, కొత్త పెట్టుబడుల సంగతేమో కానీ, ఉన్న పెట్టుబడులైనా నిలుస్తాయా? అని భావించారని వివరించారు. కానీ పాలనా సమర్థత కలిగిన ముఖ్యమంత్రి, సరైన విధానాలు, స్థిరమైన ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉన్న అధికారుల వల్ల తెలంగాణలో ఐటీ రంగం దూసుకుపోయిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.56 వేల కోట్లు కాగా, ఇప్పుడది రూ.1.40 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఖమ్మం తరహాలో అభివృద్ధిని చూడగలమన్నారు. అనుకున్నదే తడవుగా శంకుస్థాపన చేసుకుని వాటిని పూర్తి చేసి ప్రారంభించుకోవడం పట్ల మంత్రి పువ్వాడను అభినందించారు. సకల సౌకర్యాలతో, అన్ని సదుపాయాలతో రూ.25 కోట్లతో నిర్మించిన ఖమ్మం బస్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here