Wedding Pics viral
యువత అభిరుచులు మారుతున్నాయి. అలవాట్లు మారుతున్నాయి. పెళ్లి, పుట్టినరోజు.. ఇలా వేడుక ఏదేనా సరే తమకు నచ్చిన తీరిలో జరుపకుంటున్నారు. అందుకు ఉదాహరణ ఈ వెడ్డింగ్ షూట్. వెడ్డింగ్ ఫోటోషూట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్ (24) ఫోటోషూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చీర కట్టుతో, ఒంటినిండా నగలతో బ్యాటింగ్ చేస్తూ చేసిన వెడ్డింగ్ షూట్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఆమె ఫోటోలను ఐసీసీని కూడా ఆకట్టుకున్నాయి. సంజిదా ఇస్లాం ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాద్డీక్ను పెళ్లాడారు.
ఈ సందర్బంగా క్రికెట్ పై ఇష్టంతో వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. బ్యాట్ పట్టి కవర్ డ్రైవ్, పుల్ షాట్స్ ఫోజులతో అదరగొట్టారు. అందుకే నెటిజన్లు ఆమె ఫొటోలకు ఫిదా అయ్యారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తే, మరికొందరు నెగిటివ్ కామెంట్లు పెట్టారు. ఏదేమైనా సంజిదా వెడ్డింగ్ ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.