10-03-2019 నుండి 16-03-2019 వరకు వారఫలాలు

Spread the love

weekly horoscope 10 to 16 th march

మేషరాశి : 

ఈవారం మిత్రులనుండి నూతన విషయాలు తెలుసుకుంటారు, వారితో సమయం గడిపే ఆస్కారం కలదు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. చేపట్టు పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట వలన తప్పక  మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. రుణపరమైన విషయాల్లో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు స్వల్పదూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు.
 
వృషభరాశి :
ఈవారం ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వద్దు. పెద్దలతో మీకున్న పరిచయాలు బలపడుతాయి. తలపెట్టిన పనులను కాస్త శ్రమతో పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలతో విభేదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. గతంలో చేపట్టిన పనుల వలన మంచి పేరు లభిస్తుంది.విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.
 
మిథునరాశి:

ఈవారం ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. గతంలో చేపట్టిన పనుల వలన సమజాంలో మంచి పేరు లభిస్తుంది. చిన్న చిన్న విషయాలపై శ్రద్ద తీసుకోండి. సోదరులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుటకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్నవారికి బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం సూచన. స్త్రీ పరమైన విషయాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు, తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వకండి. 

కర్కాటకరాశి :

ఈవారాం తల్లి తరుపు బంధువులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగ పడుతాయి. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సోదరుల నుండి వచ్చిన సూచనల విషయాల్లో మరొకసారి ఆలోచం చేయుట మంచిది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు , అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి. అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడం మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.


సింహరాశి :
ఈవారం ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాలలో కాస్త వేచిచూసే ధోరణి మంచిది. పెద్దలతో పరిచయాలకు అవకాశం ఉంది , మీ ఆలోచనలను వారిలో పంచుకొనే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న విషయాల వలన కొంత ఇబ్బందిని ఎదుర్కటారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు, వాటిలో ఉత్సాహంగా పాల్గొంటారు. జీవితభాగస్వామితో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వారినుండి వచ్చిన సూచనాలను పరిగణలోకి తీసుకోండి. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
 
కన్యారాశి :
ఈవారం తీసుకొనే నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. గతంలో మీరు ఆలోచనలను పెద్దలకు తెలియజేసి ఉంటె వారై సూచనలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కాస్త నిదానంగా వచ్చే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం మాత్రం సమయానికి చేతికి అందుతుంది. బంధువులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండుట మంచిది. పెద్దలను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయి. వ్యాపార పరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
 
తులారాశి:

ఈవారం నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. సోదరుల విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మీదైనా ఆలోచనలకు ప్రధానాయత ఇస్తారు. పెద్దలను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగివచ్చే ఆస్కారం ఉంది. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చర్చాప్రమైన విషయాల్లో కాస్త నిదానం అవసరం.

 

వృశ్చికరాశి :

ఈవారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఒకింత జాగ్రత్త అవసరం. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఒకింత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చాపరమైన విషయాల్లో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తారు.


ధనస్సురాశి:
ఈవారం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళండి. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. పెద్దల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. మిత్రులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సూచనలు పొందుతారు. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది, కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన.నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయ్.
 
మకరరాశి :

ఈవారం చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. నూతన్ పరిచయాలు ఏర్పడుతాయి. వారినుండి ఊహించనై విధంగా సహకారం లభ్సితుంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన మంచి పేరు లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అధికారుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోండి.ఆరోగ్యం విషయంలో గతంలో మీకున్న ఆందోళనలు తగ్గుముఖం పడుతాయి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. సోదరుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. విదేశాల్లో ఉండే బంధువులు లేదా మిత్రులనుండి ముఖ్యమైన సూచనలు లేదా సమాచారం వస్తుంది.

 

కుంభరాశి :
ఈవారం కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు, వారినుండి  వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట వలన లబ్దిని పొందుతారు. మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు.

మీనరాశి :
ఈవారం పెద్దల నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొటారు. వ్యాపారపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వమై నుండి వచ్చిన ఆలోచనల విషయంలో చర్చకు అవకాశం ఇవ్వండి. సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గుతుంది.  ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది. స్త్రీ పరమైన విషయాల్లో సమయం గడుపుతారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *