12-05-2019 నుండి 18-05-2019 వరకు వారఫలాలు

Spread the love

Weekly Horoscope 12-05-1 to 18-05-2019

మేషరాశి : ఈవారం నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందిన , చివరకు చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మీరు తీసుకొనే మొండి నిర్ణయాలు మిమల్ని నిలబెడుతాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో లేదా ఆత్మీయుల కుటుంబంలో జరిగిన శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులనుండి వచ్చిన విషయాలు మిమ్మల్ని కొంత సంతోషానికి గురిచేస్తాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. 

వృషభరాశి :ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాల్లో కాస్త స్పష్టత అవసరం. ఆశించిన మేర ఆదాయం లభిస్తుంది. రుణపరమైన విషయాల్లో మొండి బకాయిలు వసూలు అవుతాయి. వాహనాల వలన మాత్రం కాస్త ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుండి మంచి సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.
 
మిథునరాశి: ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు  సాగుతాయి. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన, శక్తికి మించకపోవడం సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
కర్కాటకరాశి :ఈవారం విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. జీవితభాగస్వామితో ఉన్న విభేదాలు మరింతగా పెరుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. సోదరుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన.

 

సింహరాశి :ఈవారం బంధువులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. కుటుంబసభ్యులతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సోదరులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, నూతన ప్రయత్నాలు చేయకపోవడం సూచన.

 

కన్యారాశి :ఈవారం ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే మానసిక పరమైన సమస్యలు ఉంటాయి. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది, తోటివారి సహకారంతో నూతన పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువులను కలుస్తారు, వీరినుండి నూతన విషయాలు తెలుస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

తులారాశి:ఈవారం ఉద్యోగంలో అధికారాలతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. జీవితభాగస్వామితో ఉన్న విభేదాలు మరింతగా పెరుగుటకు అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు అలాగే వారినుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.
 
వృశ్చికరాశి :ఈవారం పెద్దలనుండి నూతన విషయాలు తెలుస్తాయి, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్న మిత్రులు లేదా బంధువులను కలుస్తారు. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. రావాల్సిన ధనం కోసం ప్రయత్నం చేయుట వలన కొంత పురోగతి అవసరం. చిన్న చిన్న విషయాల్లో ఆందోళన తప్పక పోవచ్చును. మీ మాటాటరు కొంతమందికి నచ్చకపోవచ్చును. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమల్ని ఇబ్బంది పెట్టుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ధనం వెచ్చిస్తారు. బంధువులను కలుసుకునే అవకాశం ఉంది.
 
ధనస్సురాశి:ఈవారం ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను పూర్తిచేసే విధంగా ముందుకు వెళ్ళుట సూచన. సంతానంతో సమయం గడుపుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అవుతుంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమయిన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చల వలన మనస్పర్థలు పెరుగుటకు ఆస్కారం ఉంది, సర్దుబాటు అవసరం.

 

మకరరాశి :ఈవారం తల్లితరుపు బంధువులను కలుస్తారు , వారితో సమయాన్ని గడుపుతారు . ఆత్మీయుల్లో ఒకరి ఆరోగ్యం మిమల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది కాకపోతే అదే స్థాయిలో ఆదాయం ఉండటం వలన పెదగ్గ ఇబ్బంది ఉండకపోవచ్చును. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోండి. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చర్చలకు దూరంగా ఉండుట సూచన. వీచుచుసె విధానం వలన మేలుజరుగుతుంది.

 

కుంభరాశి :ఈవారం మీ మాటతీరు కొంతమందిని ఆకట్టుకుంటుంది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి , పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. దైవపరమైన విషయాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సంతానం విషయాల్లో సంతోషం పొందుతారు. బంధువుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. చర్చల్లో పాల్గొంటారు.

 

మీనరాశి :ఈవారం మిత్రులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. దైవ పరమైన విషయాలకు సమయం ఇస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. భాగస్వామ్య ఒప్పందాలకు ఆస్కారమా ఉంది. సంతానం విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉన్న ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *