22-09-2019 నుండి 28-09-2019 వరకు వారఫలాలు

Spread the love
Weekly Horoscope 22-09-2019 to 28-09-2019
మేషరాశి :ఈవారం మొత్తం మీద ఆరంభంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, చేపట్టే పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, కాస్త సమయపాలన పాటించుట మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో మొదట్లో తడబాటు పొందిన , వాతై విషయంలో ఇబ్బందులను అధిగమిస్తారు. రుణపరమైన విషయాల్లో గతంలో ఉన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీప్రయాణప్రయత్నాలు కాస్త వాయిదా అయ్యే అవకాశం కలదు. చిన్న చిన్న విషయాల్లో శ్రద్ద అవసరం. పెద్దలతో మీకున్న పరిచయం మీకు ఉపయోగపడుతుంది. నూతన ఉద్యోగాల విషయంలో ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం సూచన. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 

వృషభరాశి :ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. స్వల్పఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. రుణపరమైన విషయాల్లో శక్తికి మించి సహాయం చేయకపోవడం సూచన.

 

 

మిథునరాశి:ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, బంధువుల కుటుంబంలో జరిగే లేదా నిర్ణయాలు తీసుకోవడంలో మీ పాత్ర ఉంటుంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను బహుమతిగా పొందుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారితో కలిసి సమయాన్ని గడుపుతారు. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. జీవితభాగస్వామి నుండి మీరు ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

కర్కాటకరాశి :ఈవారం మొత్తం మీద కుటుంబంలో అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన పనులు త్వరగా అయ్యే అవకాశం ఉంది. ఒకింత పనిఒత్తిడి ఉంటుంది. సంతానం విషయంలో ఆందోళన పొందుతారు. రుణపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగంలో సమయపాలన మంచిది. సోదరులతో మీ నిర్ణయాలు తెలియజేస్తారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట చేత మరింతగా ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యసమస్యలు తగ్గుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. చిన్న చిన్న విషయాల్లో చూసి చూడనట్లు ఉండుట అనేది సూచన.

 
సింహరాశి : ఈవారం మొత్తం మీద సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, ఆత్మీయులను కలుస్తారు. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. చర్చాపరమైన విషయాల్లో మీ నిర్ణయాల్లో స్పష్టత కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

 
కన్యారాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో మీకున్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. విలువైన వస్తువులను బహుమతిగా పొందుటకు ఆస్కారం ఉంది. సోదరులతో అలాగే కుటుంబంలో నూతన ఆలోచనలు చేయుటకు అలాగే నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం కలదు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చర్చల్లో పాల్గొంటారు.
 
తులారాశి: ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాల్లో పాల్గొనడం మంచిది. పెద్దలతో మీకున్న పరిచయాల వలన లబ్దిని పొందుతారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ ఆలోచనలు అలాగే మాటతీరు వివాదాస్పదం అయ్యే ఆస్కారం కలదు. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది. భూ సంబంధమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

వృశ్చికరాశి :ఈవారం మొత్తం మీద గతంలో తీసుకున్న నిర్ణయాల వలన పెద్దల నుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, కాస్త మెరుగైన ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాల్లో కాస్త తడబాటు ఉంటుంది, పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు చేయుప్రయత్నాల్లో మంచి ఫలితాలు పొందుతారు. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. మిత్రులను కలుస్తారు.

 
ధనస్సురాశి: ఈవారం మొత్తం మీద పెద్దలను కలిసే అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. రుణపరమైన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. తల్లితరుపు బంధువులలో ఓక్రి ఆరోగ్యం మిమ్మల్ని ఆదోళనకు గురిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయంలో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మిత్రులతో సమయం గడుపుతారు.
 
మకరరాశి :ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంతానం గురుంచి నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెద్దలతో సాధ్యమైనంత మేర మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మంచిది. చిన్న చిన్న విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ మొండినిర్ణయాల వలన మీ దగ్గరి వారు ఇబ్బందికి గురయ్యే ఆస్కారం కలదు.
 

కుంభరాశి :ఈవారం మొత్తం మీద ఆరంభంలో తీసుకొనే నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు, వేచిచూసే ధోరణి మంచిది. అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. నూతన ఉద్యోగ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్త్రీ పరమైన విషయాల్లో వేచిచూసే ధోరణి మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్త.

 

మీనరాశి : ఈవారం మొత్తం మీద సంతానం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, తొందరపాటు వద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదగా గడుపుతారు, విందులు అలాగే వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా, సర్దుకుంటాయి. సమయానికి భోజనం చేయుట మంచిది. గతంలో మీకున్న పరిచయాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమయిన సమయం. చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు విధానం ఉత్తమం. భార్యతరుపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది

 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *