ఈ వారం వారఫలాలు

43
2020 Feb Third Week Horoscope
2020 Feb Third Week Horoscope
Weekly Horoscope in Telugu
మేషరాశి :ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేసే విషయంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. తండ్రితరుపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. జీవితభాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. వివాదాలకు దూరంగా ఉండుట సూచన.

వృషభరాశి :ఈవారం మొత్తం మీద బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది.
 
మిథునరాశి:ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు, మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్నసమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న, పనిభారం పెరుగుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు అవకాశం ఉంది. సంతానం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మిమల్ని దైర్యంగా ఉండేలా చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.
 
కర్కాటకరాశి :ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాలలో సమయం గడపటం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మిత్రులతోఁ మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఉద్యోగంలో ప్రమోషన్ లేక ఆశించిన మేర బదిలీలకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుసుకుంటారు. తండ్రితరుపు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాస్త సర్దుబాటు విధానం వలన తప్పక మేలుజరుగుతుంది.

 
సింహరాశి :ఈవారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న ఒడిదుడుకులు తప్పక పోవచ్చును, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. పెద్దలతో మీకున్న పరిచయం మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పనిఒత్తడి ఊహించిన దానికన్నా అధికంగా ఉంటుంది. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. ఆత్మీయుల ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది.
 
కన్యారాశి :ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు, నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకు హైరానా పడే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. స్వల్పఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆత్మీయులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో వేచిచూసే ధోరణి మేలు.
 
తులారాశి:ఈవారం మొత్తం మీద సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ముందుగా గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశముంది, వీటి విషయంలో మీదే ప్రధాన పాత్ర ఉండే అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల్లో నిదానం అవసరం.
 
వృశ్చికరాశి :ఈవారం మొత్తం మీద ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును, సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలకు అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సమయాన్ని చర్చల్లో గడుపుతారు.
 
ధనస్సురాశి:ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. అధికారాల నుండి ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. తలపెట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చాపరమైన విషయాలకు అధిక సమయం ఇస్తారు. విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో సమయం గడుపుతారు.
 
మకరరాశి :ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు అవకాశం ఉంది, సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయంలో నూతన ఒప్పందాలకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసిన సంతృప్తి ఉండకపోవచ్చును. సంతానం నుండి ఆశించిన మేర సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. రుణపరమైన విషయాల్లో తొందరపాటు ఆలోచనలు చేయకండి అలాగే అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులను కలుస్తారు ,చర్చల్లో పాల్గొంటారు.

కుంభరాశి :ఈవారం మొత్తం మీద ఆత్మీయుల నుండి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చును. ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో సొంత నిర్ణయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. తండ్రితరుపు బంధువులతో ఊహించని విధంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. దైవకార్యక్రమాలకు సమయం ఇవ్వడం సూచన. చర్చలకు అవకాశం ఉంది.
 

మీనరాశి : ఈవారం మొత్తం మీద చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది,. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. మిత్రులతో కలిసి విందులు అలాగే వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన చర్చాపరమైన విషయాలకు అవకాశం ఉంది.

Weekly Horoscope in Telugu,Rasi Phalalu,Astrology in Telugu,Online Telugu Astrology,weekly horoscope in telugu 2019,Telugu Jatakam,Today Rasi Phalalu,Yearly Horoscope

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here