ఈ వారం వారఫలాలు తెలుసుకోండి

31
Weekly Horoscope in Telugu
Weekly Horoscope in Telugu
Weekly Horoscope in Telugu
మేషరాశి :ఈవారం ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. స్పష్టమైన ఆలోచనల్తో ముందుకు వెళ్లడం మంచిది. వ్యాపార పరమైన విషయంలో నూతన అవకాశాలు లభిస్తాయి. తండ్రితరుపు బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
 
వృషభరాశి : ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేసే సమయంలో సొంతనిర్ణయాల కన్నా వారై అభిప్రయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. సంతానం విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.
 
మిథునరాశి:ఈవారం మిత్రులను కలుస్తారు, నూతన పరిచయాలకు అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆత్మీయులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ఉద్యోగంలో పనిభారం పెరుగుటుకు అవకాశం ఉంది. నలుగురిని కలుపుకొని వెళ్ళుట మంచిది. విదశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సామాజిక పరమైన విషయాల పట్ల మక్కువని కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.
 
కర్కాటకరాశి :ఈవారం మీ ఆలోచనలను కుటుంబ పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. తలపెట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. ఆరోగ్యం ఒకింత కుదుట పడుతుంది , సంతోషించదగిన విషయం. విలువైన వస్తువులను బహుమతిగా పొందుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి, వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. తండ్రితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలిసే అవకాశం కలదు.
 
సింహరాశి :ఈవారం సంతానం నుండి ఆశించిన మేర సహకారం వస్తుంది, నూతన నిర్ణయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన సమాజంలో మంచి పేరు లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన ఫలితాలు పొందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

 
కన్యారాశి :ఈవారం బంధువులను కలుస్తారు, వారి కుటుంబంలో జరిగే శుభకార్యక్రమాల్లో మీ పాత్ర అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుతుంది, నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. స్వల్పఆరోగ్య పరమైన ఇబ్బందులు మిమల్ని ఆందోళనకు గురిచేస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీరు ఆశించిన ఫలితాలు కాస్త నిదానంగా వచ్చుటకు అవకాశం ఉంది. ఆత్మీయులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, అలాగే సహకారం కూడా లభిస్తుంది.

 
తులారాశి:ఈవారం మొదట్లో కొంత నిరాశాజనంకంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట మంచిది. వివాదాలకు దూరంగా ఉండుట మంచిది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఉన్నత ఉద్యోగం లేక విద్యకోసం విదేశీప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. గతకొంతకాలంగా ఊరిస్తున్న విషయంలో ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. స్త్రీ పరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు.
 
వృశ్చికరాశి :ఈవారం సమయాన్ని అధికభాగం సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. విందులు అలాగే వినోదాల్లో పాల్గొంటారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాల వలన ఒకింత లాభం జరిగిన పెద్దగా సంతృప్తిని ఇవ్వకపోవచ్చును విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు అవకాశం ఉంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం సూచన.
 
ధనస్సురాశి:ఈవారం ఆత్మీయులను కలుస్తారు, వారినుండి కీలకమైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులను తోటివారి సహకారంతో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. రావాల్సిన ధనం కొంతమేర చేతికి అందుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. చర్చలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది.
 
మకరరాశి :ఈవారం నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. చర్చల్లో నిదానం అవసరం.

 


కుంభరాశి :ఈవారం అనుభవజ్ఞుల అభిప్రాయాలకు అలాగే సూచనలకు ప్రధాన్యం ఇవ్వడం మంచిది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహనాలను లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశీప్రయాణాలు లేదా స్వదేశీ ప్రయాణాలు చేసే వారికి అనుకూలమైన సమయం. తండ్రితరుపు బంధువులను కలుస్తారు.
 

మీనరాశి :ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఎవరికైనా రుణపరమైన సహాయం చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. చర్చలకు అవకాశం ఇవ్వకండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here