పశ్చిమ బెంగాల్‌లో రేపే తొలిదశ పోలింగ్‌

3

West bengal first phase polling

-30 నియోజకవర్గాల్లో ముగిసిన ప్రచారం
-ఆదివాసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో తొలివిడత పోలింగ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశలో భాగంగా ఈ నెల 27 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ జరిగే 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం నిన్నటితో ముగిసింది. ఆదివాసీలు ఎక్కువగా నివసించే పురులియా, బంకురా, ఝార్‌గ్రాం, తూర్పు మేదినీపూర్‌ (పార్ట్‌ 1) తోపాటు పశ్చిమ మేదినీపూర్‌ (పార్ట్‌ 1) జిల్లాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ 30 నియోజకవర్గాలు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వైపు నిలబడగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం భాజపా క్లీన్‌స్వీప్‌ చేసింది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా తదితరులు ఈ నియోజకవర్గాల్లో పర్యటించారు. అటు మమతా బెనర్జీ సైతం ఈ 30 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు.

 

National