అనుష్క ఫేస్ కు ఏమైందీ..?

6
what happened to anushka face
what happened to anushka face

what happened to anushka face

ఇన్ని రోజుల నిశ్శబ్ధం తర్వాత తన లేటెస్ట్ మూవీ నిశ్శబ్ధం సినిమా గురించి అనుష్క నోరు విప్పింది. నిన్నటి వరకూ నిర్మాతలతో అనుష్కకు ఏవో ఇష్యూస్ ఉన్నాయనీ.. అసలు ఈ మూవీ ఓటిటిలో విడుదల చేయడం తనకిష్టం లేదనీ.. అందుకే అనుష్క ప్రమోషన్స్ కు రావడం లేదనీ.. సినిమాను గాలికొదిలేశారు అంటూ రకరకాల రూమర్స్ ఈ సినిమా గురించి వినిపించాయి. అయితే ఆ రూమర్స్ కు అనుష్క చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ అది సగంగానే మిగిలింది. తను మాట్లాడకపోతే మరికొన్ని రూమర్స్ వచ్చి ఉండేవి. కానీ మాట్లాడిన తర్వాత చాలా అనుమానాలు వస్తున్నాయి. అందులో ప్రధానమైనదే ఈ ‘అనుష్కకు అసలు ఏమైందీ’అనేది. మాధవన్, అంజలి, మాడిసన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన నిశ్శబ్ధం ఆగస్ట్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. మామూలుగా థియేటర్ రిలీజ్ కోసం చాలా రోజులుగా చూస్తున్నారు. కానీ కుదర్లేదు. ఫైనల్ గా వీళ్లూ ఓటిటికే ఓటు వేశారు. ఇది అనుష్కకు ఇష్టం లేదనే మాట ఎప్పటి నుంచో వస్తోంది. సినిమా స్ట్రీమింగ్ కు చాలా తక్కువ టైమే ఉండటంతో చాలామంది ప్రమోషన్స్ విషయంలో రకరకాల డౌట్స్ వెలిబుచ్చారు.  మామూలుగా అన్ని మీడియాస్ కు అనుష్క జూమ్ లో ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పారు.

దీంతో చాలా రోజుల తర్వాత ఏదోరకంగా అనుష్క కనిపిస్తుంది అనుకున్నవాళ్లకు నిర్వాహకులు షాక్ ఇచ్చారు. కారణం.. ఆ జూమ్ లో అనుష్క కనిపించలేదు. కేవలం వాయిస్ మాత్రమే వినిపించింది. ఇదేంటీ అని అడిగితే.. అనుష్క వీడియోలో కనిపించడానికి ఒప్పుకోలేదు. అందుకే కేవలం ఆడియో మాత్రమే ఇచ్చింది అని చెప్పారు. దీంతో అసలు అనుష్కకు ఏమైంది. ఎందుకు తను మొహం చూపించాలనుకోవడం లేదు. ఫేస్ కు ఏమైనా అయిందా లేక.. నిజంగానే ప్రమోషన్ చేయడం ఇష్టం లేదా అంటూ సరికొత్త అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ కాలంలో కూడా అనుష్క ఏదో 70,80లలో రేడియోకు ఇచ్చినట్టుగా వాయిస్ ఇంటర్వ్యూ ఇవ్వడం మాత్రం అస్సలు బాలేదంటున్నారు చాలామంది. మరి దీనికి స్వీటీ నుంచి వచ్చే ఆన్సర్ ఏటుంటాదో చూడాలి.

tollywood news