నాగ‌బాబుకు ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ ఏంటి?

What was the return gift for nagababu
ఈ మ‌ధ్య నాగబాబు త‌న సొంత యూ ట్యూబ్ చానెల్ ద్వారా పొలిటిక‌ల్ సెటైర్లు వేస్తుండ‌టం తెలిసిందే. ముందు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మొద‌లుపెట్టిన ఆయ‌న ఇప్పుడు ప‌లు ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. అయితే తాజాగా ఆయ‌న గురించి శివాజీరాజా ప్ర‌స్తావించారు. త‌న‌కు నాగ‌బాబుతో 30 ఏళ్ల స్నేహం ఉంద‌ని శివాజీరాజా అన్నారు. అయితే ఇటీవల జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో నాగ‌బాబు స్వ‌యంగా న‌రేష్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో న‌రేష్ వ‌ర్గం గెలిచింది. త‌న 30 ఏళ్లస్నేహితుడు త‌న‌కు ఈ ర‌కంగా గిఫ్ట్ ఇచ్చార‌ని, త్వ‌ర‌లోనే తాను దానికి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని శివాజీరాజా అన్నారు. అంటే ఇప్పుడు నాగ‌బాబు గురించి శివాజీరాజా ఏ విష‌యాల‌ను వెలుగులోకి తెస్తారోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఇంత‌కు పూర్వం నాగ‌బాబు `మా`కు సేవ‌లందించారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను ఏమైనా వెలికితీస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. మ‌రోవైపు `మా` డైరీ ప్ర‌చుర‌ణ విష‌యంలో రూ.7ల‌క్ష‌లు లెక్క‌లు తేల‌డం లేద‌ని శివాజీరాజా అన్నారు. అంటే ఆ స్థాయిల్లో ఉన్న న‌రేష్ అంత చిన్న మొత్తానికి ఎందుకు లెక్క‌చెప్ప‌డం లేద‌ని ఒక వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *