వాట్సాప్ గ్రూపుల తలనొప్పి తగ్గనుంది

WHATSAPP NEW FEATURE

  • కొత్త ఫీచర్ తీసుకురాబోతున్న వాట్సాప్
  • గ్రూప్స్ లో యాడ్ చేసే అంశంలో నియంత్రణ

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై ఏ గ్రూప్ లోనైనా మనల్ని యాడ్ చేయాలంటే కచ్చితంగా మన అనుమతి అవసరం. అందుకు మనం అంగీకరిస్తేనే ఏ గ్రూప్ లోనైనా సదరు అడ్మిన్ మనల్ని యాడ్ చేయగలరు. ఇప్పటివరకు మన అనుమతితో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే ఏ గ్రూప్ లోనైనా యాడ్ చేసేయొచ్చు. దీంతో పదుల కొద్దీ గ్రూప్ లలో ఉండాల్సి రావడం, ఒకే మెసేజ్ పదులసార్లు రిసీవ్ చేసుకోవాల్సి రావడం వంటి తిప్పలు తప్పనున్నాయి. ఎవరు పడితే వారు మనల్ని గ్రూపుల్లో యాడ్‌ చేయకుండా నియంత్రించేలా వాట్సాప్‌ మూడు ఆప‍్షన్లను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి ఇన్విటేషన్‌ ఫీచర్‌ను జోడించనుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ బిజెనెస్‌లో అమలు చేస్తుండగా.. అదనపు భద్రత కోసం వాట్సాప్‌లో కూడా తీసుకురానుంది. ప్రస్తుతం టెస్ట్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే ప్రయత్నించొచ్చని వాట్సాప్ చెబుతోంది. ఈ వెర్షన్ లో వాట్సప్ ప్రైవసీ సెట్టింగ్స్ లో మూడు ఆప్షన్లు ఉంటాయి.

  1. నోబడీ:ఎవరికీ మనల్ని గ్రూపులో  జోడించే అవకాశం  ఉండదు
    2. మై కాంటాక్ట్స్‌:మన కాంటాక్ట్స్ లో ఉన్నవారు మాత్రమే గ్రూపులో యాడ్‌ చేసేందుకు అనుమతినివ్వడం
    3. ఎవ్రీ వన్‌:  సదరు అడ్మిన్ మనకు పరిచయం లేకపోయినా, కాంటాక్ట్స్ లో లేకపోయినా  గ్రూపులో యాడ్‌ చేసేలా అనుమతినివ్వడం.

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *