కరోనా వ్యాక్సీన్ ఎప్పుడొస్తది?

when corona vaccine will come?

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనాను కట్టడిచేసేందుకు చైనా తరహాలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. భారతదేశం కూడా కరోనాను నియంత్రణ చర్యలను వేగవంతం చేసింది. కరోనాకు ఇప్పటివరకూ మందు లేదు.. కేవలం నియంత్రణా  చర్యలు మాత్రమే కానీ కరోనా  నివారణకు ఎలాంటి మందులు కనిపెట్టలేని ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మొట్టమొదటి వ్యాక్సీన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

గతవారమే  కరోనా  వ్యాక్సీన్ ప్రయోగ అధ్యయనంలో తొలి వాలంటీర్లకు వ్యాక్సీన్ ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సీన్ డెవలపర్ మోడ్రెనా థెరపిటిక్స్ వ్యాక్సీన్ టెస్టింగ్‌ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఒక వ్యాక్సీన్ టెస్టింగ్ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చు. కరోనా వైరస్‌లపై వ్యాధినిరోధక వ్యవస్థ నిరోధించగలదు అనేదానిపై విలువైన సమాచారాన్ని అందించగలదు. అప్పుడే సైంటిస్టులు వ్యాక్సీన్‌కు తయారీకి అవసరమైన ప్రయోగాలను ప్రారంభించేందుకు వీలుంటుంది. తొలి దశలో కరోనా ఫస్ట్ వ్యాక్సీన్ పరీక్షల్లో ఫలితాలు వచ్చిన వెంటనే భారీగా వ్యాక్సీన్ ప్రొడక్షన్‌ ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే మనుషులపై ట్రయల్స్ మొదలయ్యాయి. ప్రొడక్షన్ కూడా అంతాసిద్ధం చేస్తున్నారు. ట్రయల్స్ రిజల్ట్స్ రావడమే ఆలస్యం.. మిలియన్ల ప్రొడక్షన్ మొదలుపెట్టే అవకాశం ఉంది.  వ్యాక్సీన్ ప్రయోగంలో భాగంగా ముందుగా SARS-CoV-2 వైరస్ సోకని 45 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లకు తొలుత వ్యాక్సీన్ వేసి అధ్యయనం చేశారు. ఈ వైరస్ కారణంగా Covid-19 వ్యాధిని వ్యాప్తిచేస్తుంది. ఈ గ్రూపులో సైంటిస్టులు ఎంతవరకు సురక్షితం అనేది పరీక్షిస్తారు. ఆ తర్వాత మూడు వివిధ మోతాదుల్లో వ్యాక్సీన్ ఇస్తారు. అప్పుడు వారిలో వ్యాధినిరోధక శక్తి ఎంత సమర్థవంతంగా స్పందిస్తుంది అనేది పరీక్షిస్తారు. ఈ ప్రయోగంలో ఏదైనా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేదా రియాక్షన్స్ డెవలప్ అయ్యాయా లేదా అని సైంటిస్టులు గమనిస్తారు. ఈ ఫలితాలను ధృవీకరించేందుకు పరిశోధకులు వందలాదిమందికి పైగా ఆరోగ్యకరమైన వాలంటీర్లను రిక్రూట్ చేసుకుంటారు.

ఫిబ్రవరి చివరి వారంలోనే ఈ ట్రయల్స్ పూర్తికాగానే వ్యాక్సీన్ సీసాలను NIHకు తరలించింది. సైంటిస్టులు వాటిపై సమీక్ష జరపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మోడ్రోనా, NIH కంపెనీలు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినేస్ట్రేషన్ కు అభ్యర్థన పత్రాన్ని దాఖలు చేశాయి. ఈ పరిశోధక బృందం విలువైన సమయాన్ని ఆదా చేస్తూ సురక్షితమైన సమర్థవంతమైన వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తుందని హోగే ఆశాభావం వ్యక్తం చేశారు.  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్) మొదట ఈ వ్యాక్సీన్‌ను ప్రకటించినప్పుడు, సుమారు మూడు నెలల్లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. 63 రోజుల్లో దీన్ని పూర్తి చేశామన్నారు.అనుకున్నదాని కంటే వేగంగానే ప్రయత్నామన్నారు. వైరస్ సోకిన రోగులపై పరీక్షలు ఇంకా నెలలు మాత్రమే ఉండవచ్చు. మరో 12-18 నెలల వరకు టెస్టులు ముగియకపోవచ్చని ఫౌసీ అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో, ప్రతి వారం, రోజు, నిమిషం లెక్కేనని అన్నారు.

tags: corona virus vaccine human trails, corona effect, corona cases, pandemic, bharat vaccine,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *