థియేటర్లు తెరిచేదెప్పుడు?

When Theatres Open?

పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలిచ్చామని.. షూటింగ్ లు, థియేటర్స్ ఓపెనింగ్ లకు సంబంధించి పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినిమా షూటింగ్ లు, థియేటర్ ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులతోమాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వద్ద సినీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశం లో పలు అంశాలను చర్చించడం జరిగింది కాబట్టి తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీ ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుందన్నారు.

లాక్ డౌన్ తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లు నిలిచిపోయి ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు సినిమా ప్రముఖులు తెలియజేశారు. 28 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీ రంగంలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు c.కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ N.శంకర్, మా అధ్యక్షుడు నరేష్, FDC మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.

Tollywood Movie Updates

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *