ఇస్మార్ట్ శంక‌ర్ ఫారిన్ చెక్కేశాడా?

Spread the love
WHERE IS ISMART SHANKAR?
అదేంటీ… మూడంటే మూడు రోజులు మాత్ర‌మే క‌దా విడుద‌ల‌కు టైం ఉంది. ఇలాంట‌ప్పుడు మీడియాలో ప్ర‌చారం భారీగా ఉండాలి క‌దా! విడుద‌లైన త‌రువాత కూడా క‌నీసం ఓ వారం పాటు థియేట‌ర్ల ప‌ర్య‌ట‌న‌, టీవీ ఛానెళ్ల‌లో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు, అభిమానుల కోలాహాలం మ‌ధ్య‌లో సినిమా చూడ్డం, స‌క్సెస్ మీట్లూ… ఇలాంటి హంగామా చాలా ఉంటుంది క‌దా! కానీ, ఇస్మార్ట్ శంక‌ర్ విష‌యానికి వ‌చ్చేస‌రికి… ఇవన్నీ ఉన్నా… వాటిల్లో హీరో రామ్ ఉండ‌టం లేదు. అదేంటీ.. హీరో లేకుండా ప్ర‌చారం ఎలా అంటే.. అలానే, ఛార్మీ పూరీ ఉన్నారుగా…!
ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ పెట్టుకుని.. నాలుగు రోజులు ముందు ఫారిన్ టూర్ కి వెళ్లిపోయాడు హీరో రామ్. విదేశాల‌కు వెళ్లాల‌ని ఎప్పుడో రామ్ ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. అది కాస్తా ఇప్పుడీ ఇస్మార్ట్ శంక‌ర్ విడుద‌ల తేదీ ముందే ప‌డింది. ఎప్పుడో అనుకున్న‌ది ఇప్పుడెలా కేన్సిల్ చేసుకుంటా అనేది రామ్ లాజిక్‌. కాబ‌ట్టి, త‌న ప్లాన్ మార్చుకోకుండా విమానం ఎక్కేశాడు. ఓ నెల‌రోజుల‌పాటు రామ్ నాట్ అవైల‌బుల్. అంటే, ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌చారానికి రామ్ అందుబాటులో ఉండుట లేద‌న్న‌మాట‌. ఆ బాధ్య‌త‌ల్ని ద‌ర్శ‌కుడు పూరీ అండ్ ఛార్మీ పంచుకోవాల్సిందే. హీరో లేకుండా ప్ర‌చార‌మేంటండీ, హీరోయిన్ల‌ను పెట్టుకుని… పాపం వాళ్లు మాత్రం ఎంత‌వ‌ర‌కూ మేనేజ్ చెయ్య‌గల‌రు. రామ్ అనూహ్య విదేశీ ప్ర‌యాణంతో ఇప్పుడు ఇస్మార్ట్ టీమ్ కి కాస్త టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *