కరోనా విషయంలో ఇండియాపై డబ్ల్యూహెచ్

WHO COMMENTS ON CORONA

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటివరకు  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు  3.76 లక్షల మంది కరోనా వైరస్ సోకినట్టు  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఈ మహమ్మారి గురించి డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ స్పందిస్తూప్రస్తుత పరిస్థితుల్లో అది మరింత వేగంగా వ్యాపిస్తుంది అని  ఆయన చెప్పడం గమనార్హం.  కరోనా లక్షమందికి చేరడానికి 67 రోజుల పాటు పట్టింది  అయితే ఆ తర్వాత  11 రోజుల్లో రెండు లక్షల మందికి అంటుకుంది.  ఆ తరువాత  నాలుగు రోజుల్లోనే మూడు లక్షల మంది కరోనా సోకింది అని ఆయన తెలిపారు.ఇకపోతే  ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి జనసంఖ్య భారీగా ఉండే ఆ దేశంలో ఎక్కువ కాలం పాటు కరోనా ప్రభావం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇండియా ఇది వరకూ కొన్ని అంటు వ్యాధులను  పోలియోను సమర్థవంతంగా ఎదుర్కొందని ఇప్పుడు కూడా అదే తీరున నిలదొక్కుకుంటుందనే ఆశాభావాన్ని అయన వ్యక్తం చేసారు.

మరోవైపు లాక్ డౌన్ అయినప్పటికీ ఫ్రాన్స్ వంటి దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని  ప్రస్తుతం ఫ్రాన్స్ లాక్ డౌన్ అయ్యింది. అయినా సోమవారం ఒక్క రోజే 186 మంది కరోనా బాధితులు చనిపోయారు. మొత్తంగా ఆ దేశంలో ఇప్పటివరకు  860 మంది వరకూ కరోనా సోకి మరణించారు.  దాదాపు 20 వేల మందికి అక్కడ కరోనా సోకినట్టుగా గుర్తించారు. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉందని ఫ్రాన్స్ ఆరోగ్యశాఖా మంత్రి ప్రకటించారు. ఇవి నంబర్ల అంటే నంబర్లు కాదు ప్రాణాలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. అయితే ఫ్రాన్స్ తో పోలిస్తే  ఇండియా జనాభా పరంగా చాలా పెద్ద దేశం కాబట్టి ..ప్రభుత్వ నియమాలని పాటించకపోతే ..ఆ తరువాత జరిగే పరిణామాలపై దేశ ప్రజలే కారణం అవుతారు అంటూ అయన ఇండియన్స్ ని హెచ్చరించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ..తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వం చెప్పినట్టు కొన్ని రోజులపాటు ఇంట్లో నుండి రాకపోతేనే చాలామంచిది అని చెప్తున్నారు.

tags: corona virus corona effect, corona cases, WHO, world health organization, India Pandemic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *