నాగేశ్వరరావుతో పోటీకి ఇద్దరు భామలు…

Who Is Actress Finalized For Chaitu Nageswara Rao

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రిల జంటకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.కానీ ఈ మేటర్ ఆ ఇద్దరిదీ కాదు. లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఏఎన్నార్, సావిత్రిలది. అంటే మహానటి బ్యూటీ కీర్తి సురేష్, అందులో అక్కినేనిగా నటించిన నాగ చైతన్యది అన్నమాట. యస్.. ఈ ఇద్దరూ కలిసి ఆ సినిమాలో కొంత సేపు సందడి చేశారు. కానీ ఈ సారి ఫుల్ మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే అమ్మడికి మరో భామ కూడా పోటీగా వస్తోంది. దీంతో నాగేశ్వరరావుతో నవ సావిత్రి చేస్తుందా లేక ఆ భామ రొమాన్స్ చేస్తుందా అనేది ఫజిల్ గా మారింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు కదా. ఈ మూవీ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూవీలో ముందుగా రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ లేటెస్ట్ గా కీర్తి సురేష్ అయితే బెటరేమో అనే థాట్ లో పడ్డారట. నిజానికి రష్మిక అయితే దర్శకుడు పరశురామ్ కు కాస్త కంఫర్ట్ గా ఉంటుంది. ఆల్రెడీ ఈ ఇద్దరూ గోత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ చేశారు కాబట్టి.
కాకపోతే స్క్రిప్ట్ ను బట్టి చూస్తే కీర్తి సురేష్ బావుంటుంది అని చాలామంది అభిప్రాయ పడ్డారట. దీంతో రష్మిక నా లేక కీర్తి సురేష్ నా అనేది తేల్చుకోలేకపోతున్నాడట దర్శకుడు. మొత్తంగా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రాబోతోన్న ఈచిత్రం సమ్మర్ లోనే ప్రారంభం అవుతుంది.

Who Is Actress Finalized For Chaitu Nageswara Rao,#Rahmika,#Keerthysuresh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *