కాంగ్రెస్ కు తలనొప్పిగా బీజేపీ కూడా తయారైందా?

Spread the love

Who is jumping to BJP ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఒక పక్క టీఆర్ ఎస్ ,మరోపక్క బీజేపీ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కి చుక్కలు చూపిస్తున్నాయి . ఎవరికీ చిక్కిన వాళ్ళని, చిక్కినట్లు తమ పార్టీ వైపు లాగుతున్నారు. మొన్నటిదాకా గులాబీ పార్టీ కాంగ్రెస్ ని నుండి గెలిచిన 12 మందిని తమవైపుకు లాక్కుంది . ఇక తాజాగా బీజేపీ స్టార్ట్ చేసింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఉన్నది 6 ఎమ్మెల్యేలు. అందులో ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం జరిగింది. అయన బీజేపీ లోకి వెళ్ళటానికి సిద్దమైనట్టే అన్న సంకేతాలు వస్తున్నాయి.
అయితే పార్టీలోకి ఒక్కడివే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు MLA లను వెంటబెట్టుకొని రా..నీకు తగిన గౌరవం ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పటంతో,రాజగోపాల్ ప్రస్తుతం అదే పనిమీద ఉన్నాడు. ఇప్పటికే జగ్గారెడ్డికి ఫోన్ చేసి పార్టీ మారే విషయం గురించి మాట్లాడాడు. గతంలో జగ్గారెడ్డి బీజేపీ మూలాలున్న వ్యక్తి కావటంతో అయన కొంచం సానుకూలంగానే ఉన్నారు, ఇదే ఊపులో భద్రాచలం MLA పొదెం వీరయ్య. ములుగు MLA సీతక్కతో ఇప్పటికే మంతనాలు సాగించినట్లు తెలుస్తుంది. రాబోవు రెండు మూడు రోజుల్లో దానిపై సృష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలా తనతోపాటుగా మరో ముగ్గురిని కూడా తీసుకోని వెళ్లి, తన రేంజు ఏమిటో చూపించుకోవాలని రాజగోపాల్ తహతహలాడుతున్నాడు. ఇక తమ్ముడు రాజగోపాల్ పార్టీ మారిన తరవాత పరిస్థితులను బట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మారే అవకాశం లేకపోలేదు. ఒక పక్క పార్టీలో ఇన్ని విషయాలు జరుగుతున్నా కానీ, తెలంగాణ పీసీసీ మాత్రం మొద్దు నిద్ర పోతూనే ఉంది. పోయేవాళ్లు పోండి, ఉండేవాళ్ళు ఉండండి అనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *