ర‌కుల్ మ‌ర‌ద‌లెవ‌రో తెలుసా?

Spread the love
Who is rakul sister in LAW
ర‌కుల్ మ‌ర‌ద‌లు అన‌గానే ఆమె త‌మ్ముడు అమ‌న్ పెళ్లి చేసుకోబోతున్నార‌ని అనుకోకండి. ఆయ‌న స‌ర‌స‌న న‌టించే భామ గురించే ఇలా అన్నాం. అమ‌న్ హీరోగా వైకుంఠ‌ల‌వ్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంద‌న్న విష‌యం తెలిసిందే. ఇందులో సిద్ధికా శ‌ర్మ న‌టించ‌నుంది. సిద్ధికా శ‌ర్మ తెలుగులో ఇదే తొలి సినిమా అయితే కాదు. ఆమె ఇంత‌కు ముందే కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నాని స‌ర‌స‌న `పైసా`లో న‌టించింది. మోడ‌ల్‌గా మంచి పేరున్న వ్య‌క్తి సిద్ధికా శ‌ర్మ‌. అమ‌న్ ప‌క్క‌న తెలిసిన న‌టి క‌న్నా, కాస్త వెండితెర‌కు కొత్త కొత్త‌గా ఉన్న న‌టి అయితే బావుంటుంద‌ని ద‌ర్శ‌కుడు బావించాడ‌ట‌. అందుకే సిద్ధిక‌ను క‌లిసి క‌థ చెప్పారు. ఆమె కూడా క‌థ న‌చ్చ‌డంతో అంగీక‌రించింది. ఈ భామ ఇప్ప‌టికే సెట్స్ కు వ‌చ్చేసింది. ఇప్పుడు వారిద్ద‌రి మీద కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. `అమ‌న్ కొత్త వ్య‌క్తి కావ‌డంతో సిద్ధిక కూడా పెద్ద‌గా తెలుగువారికి ప‌రిచ‌యం లేక‌పోవ‌డంతో వారిద్ద‌రి జోడీ బావుంటుంద‌ని ద‌ర్శ‌కుడు భావించారు. అందుకే ఆయ‌న ఆమెను ఎంపిక చేశారు“ అని స‌న్నిహితుల స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *