బైంసా అల్లర్లకు బాధ్యులెవరు?

4
BAINSA RIOTS AGAIN
BAINSA RIOTS AGAIN

Who is responsible for Bainsa Riots?

బైంసా నగరానికి చెందిన బాధ్యత కలిగిన ఒక డాక్టర్ మహిపాల్.వీరి ఎర్టిగా కారును సంఘ విద్రోహ శక్తుల గుండాలు దగ్ధం చేశారు. సరిగ్గా అదే సమయంలో గస్తీ తిరుగుతూ వచ్చిన పోలీసులు ఈ గుండాల గుంపును చూసి ఏమి స్పందించకుండా కారును తగులబెడుతుంటే ఆపకుండా తమ దారిన తాము వెళ్లిపోవడం ఏమి సూచిస్తున్నది?

తెలంగాణ పోలీసులు సంఘ విద్రోహ శక్తుల గుండాల ముందు సాగిలపడి వారి గుండాయిజంని ఆపడం అటుంచి సంఘ వ్యతిరేక శక్తులకే సహాయపడే విధంగా వ్యవహరిస్తున్న తీరు సాధారణ పౌరుల యొక్క గుండెలు మండేటట్లు చేస్తున్నది. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని బాధితులకు అండగా ఉంటూ ఆదు కోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది. కారు దగ్ధం చేస్తున్న దుండగులను ఇప్పటికీ ఎవరిని అరెస్టు చెయ్యలేదన్న విమర్శలు వస్తున్నాయి.భైంసా పోలీసుల చేతగానితనమా?రాజకీయ పెద్దల మద్దతా? అన్న చర్చ కూడా ప్రజల్లో జరుగుతుంది.