తెలంగాణా బీజేపీ అధ్యక్షుడి రేసులో ఆ ముగ్గురు

Spread the love

WHO IS TELANGANA BJP NEW PRESIDENT?

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపి పావులు కదుపుతోంది. తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ తమ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. నిజానికి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటే సాధించిన బీజేపీ ఇక ఆశలు వదిలేసుకుందట. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా… ఆశ్చర్యకరంగా ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను గెలవడంతో ఆశలు చిగురించాయట. ఈ అనూహ్య ఫలితంతో గేర్ మార్చిన బీజేపీ తెలంగాణలో బలపడే చాన్స్ ఉందని గమనించి ఇప్పుడు ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టింది. ఇతర పార్టీల నేతల చేరికలకు రెడ్ కార్పెట్ వేసింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాగానే పనిచేస్తున్న బీసీ వర్గానికి చెందిన లక్ష్మణ్ ను ఇప్పుడు మార్చడానికి అమిత్ షా సిద్ధమయ్యారు. మొన్న తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన అమిత్ షా, 20 లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టారు. కానీ, అందులో సగం మాత్రమే పూర్తయింది. దీంతో, ఆయన ఇక్కడి నేతలకు గట్టిగా క్లాస్ పీకారట. ఇలాగైతే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ముందుకు నడిపించలేమని నిశ్చతాభిప్రాయానికి వచ్చారట. అందుకే, అర్జంటుగా తెలంగాణ పార్టీని సంస్కరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, తెలంగాణ అధ్యక్షుడిని మార్చబోతున్నారు. కొత్త బీజేపీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్ రావు, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్… పేర్లు వినిపిస్తున్నాయి.

మురళీధర్ రావు, రాంచంద్ర రావుది అగ్ర వర్ణం (బ్రాహ్మణ). అందుకే, బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ వైపు అమిత్ షా మొగ్గు చూపుతున్నారు. అరవింద్ ఏకంగా నిజామాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురును ఓడించడం బీజేపీ పెద్దలను ఆకర్షించింది. అరవింద్ దూకుడు – వ్యవహారశైలి బాగా నచ్చడంతో ఆయనకే పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. అయితే రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం మైనస్ అంటున్నారు. లక్ష్మణ్ బీసీ కావడంతో ఆయన స్థానంలో మరో బీసీని నియమిస్తేనే పార్టీలో సామరస్య పూర్వక వాతావరణం ఉంటుందని భావిస్తున్నారట..అందుకే జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న మురళీ ధర్ రావును ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిని చేయడం మంచిది కాదన్న అభిప్రాయానికి అమిత్ షా వచ్చారట. ఇక అగ్రవర్ణం కోటా రాంచంద్రరావుకు కూడా మైనస్ గా మారింది. అందుకే ఇప్పుడు యువకుడు – దూకుడుగా వెళ్తున్న అరవింద్ ను బీజేపీ కొత్త అధ్యక్షుడిగా చేయాలని అమిత్ షా యోచిస్తున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే మురళీధర్ రావు – రాంచంద్రరావు – అరవింద్ లలో అమిత్ షా ఎవరిపై మొగ్గు చూపుతారన్న ఆసక్తి బీజేపీ నేతలను ఉత్కంఠకు గురిచేస్తోందనే చర్చ జరుగుతోంది.

NEW BJP PRESIDENT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *