రాహుల్ పై దాడి చేసింది వారేనా?

whos attacked on rahul sipligunj

రాహుల్ సిప్లిగంజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకుడిగానే కాకుండా బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గా అందరికీ సుపరిచితుడు . హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడు అయిన  రాహుల్ సిప్లిగంజ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో బీరు సీసాలతో గాయపరిచారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక రాహుల్ పై దాడి చేసిన వారిలో తాండూరు ఎమ్మెల్యే సోదరుడు ఉన్నారని చెబుతున్నారు.

ఇక  తనపై దాడి జరిగినా.. గాయాలపాలైనా.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని… దాడి ఘటనపై ఫిర్యాదు చేయకుండానే ఇంటికి వెళ్లిపోయారు బిగ్‌బాస్ తెలుగు-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్. అయితే, తనపై దాడి జరిగినా రాహుల్ ఎందుకు వెళ్లిపోయారు అనే చర్చ మొదలైంది… దాడి చేసింది ఎమ్మెల్యే సోదరుడని భయపడ్డాడా..? లేక తన తప్పు ఉంది కాబట్టే.. సైలెంట్‌గా వెళ్లిపోయాడా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, మొత్తానికి మధ్యాహ్నం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు  వెళ్ళిన  రాహుల్ సిప్లిగంజ్ పబ్బులో తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్న ఆయన తనతో పాటు ఉన్న మహిళలపై అనుచితంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, దాడి కూడా చేశారని, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, తనపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ ఫిర్యాదులో ఫిర్యాదు చేసిన రాహుల్.. పబ్బులో జరిగిన ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన చర్చ తెలంగాణలో హాట్ టాపిక్ అయింది.
whos attacked on rahul sipligunj,rahul sipligunj, telangana, hyderabad, pub, attack , drunken people, tanduru mla’s brother, injuries , police case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *