ప్రియాంకా రెడ్డి హత్య.. కేసీఆర్ స్పందన ఏదీ ?

Why CM KCR Not Responding On Priyanka Reddy

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డిని  అత్యాచారం చేసి,దారుణంగా హత్యచేసిన దారుణ ఘటనపై దేశం అంతా స్పందించినా ఇప్పటికీ తెలంగాణా సీఎం కేసీఆర్ స్పందించలేదు . ఒకప్పుడు ఆడపిల్లల వంక చూస్తే గుడ్లు పీకేసేలా నిర్ణయాలు తీసుకుంటామని, ఆడపిల్లల భద్రత తమ బాధ్యత అని చెప్పిన కేసీఆర్  ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నారని మహిళాలోకం మండిపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, మహిళా రక్షణ కోసం నడుం బిగించాలని డిమాండ్ చేస్తుంది. దోషులను శిక్షించటం ఆలస్యం అయితే నేరస్తులకు భయం ఉండటం లేదని చెప్తున్నారు. సత్వర న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇదే సమయంలో ప్రియాంక అంత్యక్రియల విషయంలో కూడా కనీసం అంతిమ సంస్కారాలు కూడా చెయ్యలేకుండా చేశారని వాపోతున్నారు కుటుంబ సభ్యులు . పెళ్లి కాని వారు చనిపోతే తమ కులంలో దహన సంస్కారాలకు ముందు చెట్టుతో వివాహం జరిపించడం తమ ఆచారమని, కానీ, ప్రియాంక పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో జరిపించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో మహిళల రక్షణకు కఠినతర చట్టాలు తెచ్చినప్పటికీ ఇటువంటి వాటిని నిరోధించలేకపోతున్నారని అన్నారు. ఈ లోపాలను సరిచేసి, దేశంలో అమ్మాయిలకు భద్రత ఉంటుందని తెలిసేలా చేయాలని ప్రియాంక బంధువులు  చెప్తున్నారు . ప్రియాంక రెడ్డి ఘటనపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ స్పందించలేదని, సంతాపం కూడా తెలియజేయలేదని వారు  వాపోయారు. ప్రియాంకకు జంతువులంటే చాలా ఇష్టమని, అందుకే  వెటర్నరీ వైద్యురాలయిందని చెప్పారు. మొత్తానికి ప్రియాంకా రెడ్డి హత్య నేపధ్యంలో సీఎం కేసీఆర్ స్పందన లేకపోవటం పలు విమర్శలకు కారణం అవుతుంది.

Why CM KCR Not Responding On Priyanka Reddy,priyanka reddy, cm kcr, priyanka reddy murder, shad nagar , veterinary doctor ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *