పరుపు కింద శవం.. పైన అతడు

WIFE DEAD BODY IN BED

  • భార్యను చంపి బెడ్ బాక్స్ లో దాచిన కసాయి
  • విషయం తెలియక దానిపైనే పడుకున్న ఇంటి యజమాని
  • బీహార్ లో వెలుగుచూసిన దారుణం

ఒకరి ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి తన భార్యను చంపేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఇంటి యజమాని బెడ్ బాక్సులో దాచిపెట్టాడు. ఈ విషయం తెలియని ఆయన.. అదే బెడ్ పై ఏకంగా ఐదు రోజులు పడుకున్నాడు. బెడ్ నుంచి దుర్వాసన రావడంతో అందులో ఏముందో చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ఈ దారుణ ఉదంతం బీహార్ లో జరిగింది. బీహార్‌లోని గయ ప్రాంతానికి చెందిన దినేష్‌ కుమార్‌ అనే టీ వ్యాపారి వద్ద రాజేష్‌ కుమార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన భార్య బబితతో కలిసి యజమాని ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల దినేష్ ఊరు వెళుతూ ఇంటి తాళాలు రాజేష్‌కు ఇచ్చి వెళ్లాడు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన దినేష్‌.. ఎప్పటిలాగే తన బెడ్ రూమ్ కు వెళ్లి పరుపుపై పడుకున్నాడు. అయితే, ఏదో దుర్వాసన రావడంతో అన్నీ పరిశీలించి చూశాడు. ఎలుక చనిపోయి ఉంటుందని, మరుసటి రోజు శుభ్రం చేద్దామని భావించి ఆ రాత్రి అలాగే పడుకున్నాడు. మరుసటి రోజు గదంతా వెతికినా ఎలుక దొరకలేదు. రెండో రోజు, మూడో రోజు కూడా దుర్వాసనతోనే పడుకున్నాడు. రానురాను ఆ వాసన మరింత పెరగడంతో దినేష్ కి ఏమీ అర్థం కాలేదు. అలా ఐదు రోజులపాటు అదే పరుపు పై పడుకున్న అతడు ఆరో రోజు ఉదయం తన బెడ్ బాక్సు తెరచి చూసి.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అందులో ఓ మహిళ శవం కనిపించడంతో వణికిపోయాడు. ఐదురోజులపాటు కింద శవాన్ని పెట్టుకుని పడుకున్నానా అని తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం రాజేష్ భార్య బబితదిగా గుర్తించారు. అప్పటికే రాజేష్ పరారీలో ఉండటం.. మృతురాలి తల్లిదండ్రులు కూడా అల్లుడిపైనే అనుమానం వ్యక్తంచేయడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.

CRIME NEWS

Related posts:

యువతులను మోసం చేసి కోట్లకు టోకరా
ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్
ప్రియాంక హత్య కేసులో నలుగురు అరెస్టు
కీర్తి కేసులో ట్విస్ట్ లు ఎన్నో...
పట్టపగలు పంజాగుట్ట నడిరోడ్డు మీద హత్య
నాగార్జునసాగర్లోకి కారు.. ఆరుగురు గల్లంతు
రవిప్రకాశ్ కస్టడీ పై పూర్తయిన వాదనలు
5K ఇవ్వలేదని మేనకోడలిని బండకు కొట్టిన రాక్షసుడు 
పౌల్ట్రీ ఫామ్ లో మహిళపై గ్యాంగ్ రేప్
టాయిలెట్ కు వెళితే అనుమానంతో చంపేశారు
కారు ప్రమాదంలో పరిగి ఎమ్మెల్యేకు గాయాలు
చేతబడి చేశాడని మహిళతో పాటు చితిపై యువకుడి దహనం
వరద పోటెత్తుతుంటే బోటును ఎలా అనుమతించారు?
వివేకా హత్య కేసు నిందితుడు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య కేసులో
పోలీసు అలర్ట్.. నిఘా నీడలో వినాయక  మండపాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *