పెళ్లయిన 15 రోజులకే భార్య..

wife suicide after 15 days of marriage

పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదం భర్తను బలి తీసుకోగా భార్యా భవనం పైనుంచి దూకి మృత్యువుతో పోరాడుతోంది. ఇండోర్‌కు చెందిన యువతి(28), ఉజ్జయినికి చెందిన యువకుడిని 15 రోజుల క్రితం వివాహం చేసుకుంది. దంపతులు ఇండోర్‌లో కాపురం పెట్టగా బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య షాపింగ్‌మాల్ మూడో అంతస్తు పైనుంచి దూకింది. సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. భర్తతో కలిపి తన దహన సంస్కారాలు చేయాలని యువతి రాసిన సూసైట్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఆర్ కుమ్రావత్ తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యువతి షాపింగ్‌ మాల్‌ పైనుంచి దూకిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..

madhyapradesh crime news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *