దుబ్బాకలో బీజేపీ గెలుపు?

2
BJP WON DUBBAKA
BJP WON DUBBAKA

Will Bjp Win Dubbaka?

దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తెరాస అభ్యర్థి మీద సుమారు నాలుగు వేల నుంచి ఆరు వేల ఓట్లతో విజయం సాధిస్తారని పబ్లిక్ పల్స్ అనే సంస్ద విడుదల చేసిన సర్వే వెల్లడించింది. ఈ సంస్థ ప్రకారం.. అధికార పార్టీకి 42.5 శాతం ఓట్లు వస్తే.. కమలం అభ్యర్థికి సుమారు 45.2 శాతం ఓట్లు వస్తాయని తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం సుమారు 11 శాతం ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది. పబ్లిక్ పల్స్ విడుదల చేసిన ఈ సర్వేలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ, గత కొంతకాలం నుంచి ఎన్నికల ప్రచార సరళిని చూస్తే బీజేపీ హోరాహోరీగానే పోటీ పడింది. రెండు పార్టీల మధ్య సమయం రసవత్తరంగా సాగింది. చివర్లో బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మీద దాడి జరిగిందంటూ అధికార పార్టీ సింపతిని సాధించే ప్రయత్నం చేసిందని ప్రజలు భావిస్తున్నారు.

దుబ్బాకలో మొత్తం ఏడు మండలాలు ఉండగా.. నాలుగు మండలాల్లో బీజేపీ మెజార్టీ సాధిస్తుందని, టీఆర్ఎస్ కేవలం రెండు మండలాల్లో, కాంగ్రెస్ తోగుట మండలంలో మెజార్టీ సాధిస్తుందని పబ్లిక్ పల్స్ వెల్లడించింది. మరి, ఈ సర్వే గురించి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో తెలియాలంటే, మరికొంత సమయం వేచి చూడాల్సిందే. పైగా, ఈ సర్వే ఎంతవరకూ వాస్తవమో తెలియడానికి ఫలితాలు కోసం ఎదురు చూడాల్సిందే.

Dubbaka Exit Polls