కేసీఆర్ ను గద్దె దించుతాడట

Will Defeat Kcr and Ktr

వామ్మో హన్మంతన్నకు కోపం వచ్చింది. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. వలస కార్మికులను తెలంగాణ ప్రభుత్వం అణగతొక్కుతోందని ఆరోపించారు. వలస కార్మికులను చూస్తుంటే కనీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వలస కార్మికులకు తెలంగాణలో ఓట్లు లేవు కాబట్టే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వలస కార్మికులను కలిసేందుకు తాను పోతుంటే నా పై 188-269-271సెక్షన్ కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన పని చేస్తే మా పై కేసులు పెడతారా అని నిలదీశారు. ఆయన ఏమన్నారంటే..

‘‘వలస కార్మికులను సిరిసిల్ల నుంచి పంపించేందుకు ప్రభుత్వం అనుమతి తీసుకున్న తరువాత కేటీఆర్ అడ్డుకున్నారు. కేటీఆర్ కార్మికులను అడ్డుకోవడంతో ఇప్పటికి వలస కార్మికులు ఏడుస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు-ఈటెల రాజేందర్ కంటే కేటీఆర్ పెద్ద ఉద్యమ కారునివా? చీఫ్ మినిష్టర్ ఫండ్స్ కేటీఆర్ కి ఏమీ అర్హత ఉందని కేటీఆర్ చెక్కులను తీసుకుంటాడు? కేటీఆర్ కి ఉన్న అర్హత ఉన్నది కేసీఆర్ కొడుకు అనా? చీఫ్ మినిష్టర్ ఫండ్స్ చెక్కులు సీఎం లేకపోతే ఆర్థిక మంత్రి తీసుకోవాలి కేటీఆర్ ఎందుకు తీసుకుంటాడు? కేటీఆర్ దాదాగిరి టీఆరెస్ లో నడుస్తది-కాంగ్రెస్ దగ్గర కాదు. టీఆరెస్ పార్టీలో ఉద్యమంలో ఉన్న నేతలు కాకుండా ద్రోహులందరు ఉన్నారు. కేసీఆర్ తన కొడుక్కి చెప్పుకోవాలి లేదంటే చూస్తూ ఉరుకొం. హైదరాబాద్ లో కేసులు పెరిగాయి అంటే కారణం కేటీఆర్. కేసీఆర్-కేటీఆర్ ను గద్దె దించే వరకు నేను ఉరుకోను.’’

Telangana Congress Updates

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *