కేసీఆర్ పాస్ పోర్టు కథేంటి?

Will Reveal Kcr Passport Story

2017 నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో హరీష్ రావు పుణ్యమా అని నీటి కష్టాలు మొదలు అయ్యాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతూ.. హరీష్ రావు మంత్రి కాదు నీళ్ల దొంగ అని దుయ్యబట్టారు. సంగారెడ్డి ప్రజల బతుకులతో చెలగాటం ఆడుతూ సిద్దిపేటకు నీళ్లు తీసుకొచ్చి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. హరీష్ రావు సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రెండు మూడు రోజుల్లో సెకండ్ ఎపిసోడ్ లో బయటపెడుతానని వెల్లడించారు. సన్మానానికి ముందు- తరువాత ఎమీ జరిగిందో త్వరలో బయపెడుతానని వెల్లడించారు. సెకండ్ ఎపిసోడ్ లో కేసీఆర్ పాస్ పోర్ట్ విషయం కూడా బయటకువస్తదని తెలిపారు. తాను ఎవ్వరికి బయపడనని, తనపై పెట్టాల్సిన కేసులన్ని పెట్టారని చెప్పారు.

#JaggaReddy Attacked #HarishRao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *