will varun grab the chance?
వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ మూసలో పడిపోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. చాలా వరకూ సాధించాడు కూడా. ఒక సినిమాకు మరో సినిమాకూ పోలిక లేకుండా డిఫరెంట్ స్టోరీ సెలెక్షన్ తోనూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో పర్టిక్యులర్ ఇమేజ్ లో ఆగిపోకుండా సాగిపోతున్నాడు. గద్దలకొండ గణేశ్ సినిమాతో మాస్ నూ ఓ రేంజ్ లో మెప్పించి భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. దీని తర్వాత వెంటనే బాక్సింగ్ నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా అనౌన్స్ అయింది. కానీ కరోనా వల్ల ఆగిపోయిందీ మూవీ. ఓ వైపు బాక్సింగ్ స్పోర్ట్ మూవీకి ప్రిపేర్ అవుతోన్న వరుణ్ లేటెస్ట్ గా మరో సినిమా కమిట్ అయ్యాడు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలతో మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం ఉండబోతోంది.
సాగర్ చంద్ర కేవలం రెండు సినిమాలతోనే ప్రత్యేక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అప్పట్లో ఒకడుండేవాడుతో పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచాడు. కానీ ఎందుకో ఆ వెంటనే సినిమాలు చేయడంలో కాస్త వెనక బడ్డాడు. వరుణ్ తేజ్ ఎలాంటి కథైనా చేయగల టాలెంటెడ్ అనిపించుకున్నాడు. అయితే సాగర్ చంద్ర తనపై ఉండే ఎక్స్ పెక్టేషన్స్ కు భిన్నంగా ఈ సారి పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడట. ఇందులోనే మంచి ప్రేమకథ కూడా ఉంటుందని సమాచారం. నిజానికి సాగర్ చంద్ర ఓ మళయాల సినిమా రీమేక్ చేయాల్సి ఉంది. మరి ఏమైందో కానీ లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఏదైతేనేం.. ఇది తన కథ కాబట్టి ఖచ్చితంగా ఆ ముద్ర కనిపిస్తుందనుకోవచ్చు. మరి ఈ మూవీతో వరుణ్ కు మంచి హిట్ ఇస్తే.. ఇతర యంగ్ హీరోలు కూడా సాగర్ చంద్రవైపు చూస్తారు అని చెప్పొచ్చు.